News June 28, 2024
నల్గొండ: మహిళా సంఘాలకు మీ సేవ కేంద్రాలు!

స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో స్త్రీ శక్తి క్యాంటీన్లను మహిళా సంఘాలకు అప్పగించిన ప్రభుత్వం.. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో మీ సేవ కేంద్రాలను కూడా మహిళా సంఘాలకు అప్పగించనుంది. దీంతో నల్గొండ జిల్లాలోని 33 మండలాల పరిధిలో 103 మీ సేవ కేంద్రాలను మంజూరు చేసింది. వీటిని గ్రామ మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నిర్వహించనుంది.
Similar News
News November 16, 2025
NLG: బస్టాపుల వద్ద బస్సులు ఆపరా?

నల్గొండ జిల్లాలో బస్టాపుల వద్ద, రిక్వెస్ట్ స్టాప్ల వద్ద బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆపాల్సిన స్టేజీల్లో బస్సు ఆపకుండా కొందరు కండక్టర్లు, డ్రైవర్లు ముప్పుతిప్పలు పెడుతున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే ప్రయాణికులతో సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు దృష్టి సారించి, సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
News November 16, 2025
NLG: రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేత

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకువచ్చిన కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తూ జిన్నింగ్ మిల్లుల యజమానులు సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేయాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా 25 జిన్నింగ్ మిల్లులు ఉండగా తొలుత 9 సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సీసీఐ విధించిన కొత్త నిబంధనలు రైతులు, తమకు ఆటంకంగా మారుతున్నాయని జిన్నింగ్ యజమానులు ఆరోపిస్తున్నారు.
News November 16, 2025
నల్గొండ జిల్లాలో చలి పులి పంజా

జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతుంది. ఐదు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు 10 – 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుండడంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రెండు మూడు రోజులు జిల్లాలో శీతల గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రాత్రి, పగలు శీతల గాలులు వీస్తుండడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో జనం బయటకు రాని పరిస్థితులు నెలకొన్నాయి.


