News February 8, 2025

నల్గొండ: మాతా శిశుమరణాల రేటు తగ్గింపును సవాల్‌‌గా తీసుకోవాలి: కలెక్టర్

image

మాతా శిశుమరణాలను తగ్గించడాన్ని సవాల్‌గా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్‌లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఆశ కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించి అన్ని రంగాలలో మనిషి ముందుకెళ్తున్నప్పటికీ అవగాహన లోపం, మూఢ నమ్మకాలతో అక్కడక్కడా ఇంకా మాతా శిశు మరణాలు నమోదవుతున్నాయని అన్నారు.

Similar News

News November 24, 2025

ప్రజా సమస్యల పరిష్కారం దిశగా గ్రీవెన్స్ డే: ఎస్పీ

image

ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించే విధంగా కృషి చేయడమే లక్ష్యంగా ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 33 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వినతులను స్వీకరించారు. సంబంధిత ఫిర్యాదులపై వేగంగా స్పందించి పోలీస్ సేవలు అందజేయాలని ఎస్పీ సూచించారు.

News November 24, 2025

NLG: 30వ తేదీ వరకు పెన్షన్ల పంపిణీ

image

జిల్లాలో వివిధ రకాల చేయూత / ఆసరా పింఛన్లు (వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళ పింఛన్లు) నేటి నుంచి ఈనెల 30వ తేదీ వరకు పంపిణీ చేస్తామని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి తెలిపారు. పెన్షన్ దారులు పెన్షన్ మొత్తాన్ని నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి నుంచి పొందాలని సూచించారు.

News November 24, 2025

NLG: ఏర్పాట్లు వేగవంతం… సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి

image

జిల్లాలో గ్రామపంచాయతీ సర్పంచుల ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం, రెవెన్యూ, పంచాయతీరాజ్ విభాగాలు ముందస్తు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు. పోలీసు శాఖ సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి బందోబస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఆదనపు బలగాలు, రాత్రి పర్యవేక్షణ, సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక మొబైల్ పెట్రోలింగ్ తదితర వాటికి సంబంధించి దృష్టి సారిస్తున్నారు.