News June 3, 2024

నల్గొండ: మిషన్ భగీరథ ట్యాంక్‌లో పడి వ్యక్తి మృతి

image

పది రోజుల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తి మిషన్ భగీరథ నీళ్ల ట్యాంకులో శవమై తేలాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండలోని 28వ వార్డు హనుమాన్ నగర్ కాలనీకి చెందిన ఆవుల వంశీకృష్ణ యాదవ్(26)గత నెల 24న ఇంటి నుంచి బయటికి వెళ్లి కనిపించకుండా పోయాడు. అతడి కోసం కుటుంబ సభ్యులు చాలా చోట్ల వెతికారు. ఈరోజు పట్టణంలోని 12వ వార్డులో గల హిందూపూర్ మిషన్ భగీరథ నీళ్ల ట్యాంకులో శవమై కనిపించాడు.

Similar News

News September 9, 2024

NLG: రూ.10లక్షలు గెలిచే ఛాన్స్

image

RBI 90వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా డిగ్రీ విద్యార్థులకు RBI-90 పేరిట క్విజ్ నిర్వహిస్తోంది. గెలిస్తే రూ.10 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. ఈ పోటీలో పాల్గొనేందుకు www.rbi90quiz.in వెబ్‌సైట్‌ ద్వారా ఈనెల17 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఈనెల 19నుంచి 21 వరకు ఉ.9 నుంచి రా.9గం.వరకు పోటీలు జరగనున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో మొత్తం 50కి పైగా కళాశాలలు ఉన్నాయి. 15వేల మందికిపైగా చదువుకుంటున్నారు.

News September 9, 2024

అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం

image

భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టం అంచనాలను పూర్తి జాగ్రత్తగా రూపొందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్, సహాయ ఐఏఎస్ అధికారి అనితా రామచంద్రన్ అధికారులను ఆదేశించారు. ఆదివారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డితో కలిసి ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టం అంచనాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

News September 8, 2024

జాతీయ రహదారిపై కారులో మంటలు

image

చిట్యాల పట్టణ శివారులో గల పెట్రోల్ పంపు సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మంటలను గుర్తించి వెంటనే కారును పక్కకు ఆపడంతో ఇద్దరికీ ప్రాణాపాయ తప్పింది. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.