News June 6, 2024
నల్గొండ: ముగిసిన మూడోరౌండ్.. మల్లన్నకు 18వేల లీడ్

నల్గొండలో ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. మూడు రౌండ్లు ముగిసేసరికి 2,64,216 మొదటి ప్రాధాన్యత చెల్లిన ఓట్లు నమోదయాయి. తీన్మార్ మల్లన్న 1,06,234, రాకేశ్ రెడ్డి 87,356, ప్రేమేందర్ రెడ్డి 34,516, ఆశోక్ పాలకూరి 27,493లకు ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 18,878 ఓట్ల లీడ్లో ఉన్నారు.
Similar News
News January 3, 2026
NLG: టీచర్లకు పరీక్ష.. విద్యార్థులకు బోధన ఎలా?

జిల్లా కేంద్రంలో రేపటి నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. టెట్ రాసేందుకు చాలా మంది ఇన్ సర్వీస్ టీచర్లు ఫీజు కట్టారు. కొంతమంది వచ్చే విడతలో చెల్లించి రాయాలని చూస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. టెట్ పరీక్ష రోజున ఉపాధ్యాయులందరూ స్కూల్ను విడిచి వెళ్లే పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వేర్వేరు తేదీల్లో 6 రోజులపాటు పరీక్షలు జరగనున్నాయి. 1,557 మంది ఉపాధ్యాయులు పరీక్షలకు వెళ్లనున్నారు.
News January 3, 2026
NLG: తొలగిన కష్టాలు.. పెరిగిన యూరియా కొనుగోళ్లు

జిల్లాలో యూరియా యాప్ ద్వారా బుకింగ్ విజయవంతంగా సాగుతుంది. యాప్ ప్రారంభంలో తొలి 2 రోజులు రైతులు ఇబ్బందులకు గురయ్యారు. ఆ తర్వాత యాప్ బుకింగ్ లో సమస్యలు తొలగిపోవడంతో రైతులకు పారదర్శకంగా యూరియా అందుతుంది. పది రోజుల్లో జిల్లాలో 34,579 మంది రైతులు లక్షకు పైగా యూరియా బస్తాలు కొనుగోలు చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ తెలిపారు.
News January 3, 2026
NLG: రేపటి నుంచి టెట్ పరీక్షలు షురూ

ఉపాధ్యాయ అర్హత పరీక్షలు(టెట్) ఈనెల 4 నుంచి ప్రారంభం కానున్నాయి. 6 రోజుల పాటు జరిగే పరీక్షల నిర్వహణ కోసం నల్గొండ పట్టణంలోని ఎస్పీఆర్ స్కూల్లో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈనెల 4, 8, 9, 11, 19, 20 తేదీల్లో టెట్ పరీక్షలు జరుగనున్నాయి. 1,557 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలు జరుగనున్నాయి.


