News July 5, 2024

నల్గొండ: మూసీలోకి వరద.. పెరుగుతున్న నీటిమట్టం

image

నాగార్జునసాగర్‌ తర్వాత జిల్లాలో రెండో పెద్దజలాశయంగా ఉన్న మూసీ రిజర్వాయర్‌ నీటిమట్టం పెరుగుతోంది. మూసీ ఎగువప్రాంతాలైన HYDతో పాటు, మేడ్చల్‌- మల్కాజిగిరి, రంగారెడ్డి, భువనగిరి, జనగామ తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిరంతరం వాగులు, వంకలద్వారా వరదనీరు వచ్చి చేరుతుంది. మూసీ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా గురువారం సాయంత్రం వరకు రిజర్వాయర్‌ నీటిమట్టం 637.5 అడుగులకు పెరిగింది.

Similar News

News November 26, 2025

నల్గొండ: పౌరులందరి హక్కులకు రాజ్యాంగం రక్ష: ఇన్‌ఛార్జ్ డీఆర్ఓ

image

భారత రాజ్యాంగం దేశంలోని పౌరులందరి హక్కులకు రక్షణ కల్పిస్తుందని ఇన్‌ఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి వై.అశోక్ రెడ్డి అన్నారు. నల్గొండ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన మౌలిక హక్కులు, బాధ్యతలు ప్రతి పౌరుడు తప్పనిసరిగా తెలుసుకొని, వాటిని ఆచరించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

News November 26, 2025

NLG: సర్పంచ్ ఎన్నికలలో వారిని దింపేందుకు ఫోకస్..!

image

ఎన్నికల కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఆశావహుల ఉత్కంఠకు తెరపడింది. ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడడంతో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, BRS, BJP దృష్టి సారించాయి. ఆర్థికంగా బలంగా ఉన్న వారితోపాటు, పలుకుబడి ఉన్న వారిని గుర్తించి మద్దతు ఇచ్చే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తుంది. జిల్లాలో మొదటి విడతలో 318, 2వ విడతలో 282, 3వ విడతలో 269 జీపీలకు పోలింగ్ జరగనుంది.

News November 26, 2025

మునుగోడు: పత్తి మిల్లులో అనుమానాస్పదంగా కార్మికుడు మృతి

image

మునుగోడు మండలం కొంపల్లిలోని జై బిందు పత్తి కొనుగోలు కేంద్రంలో మహారాష్ట్రకు చెందిన కార్మికుడు ముస్తఫా జాఫర్ సాఫ్ జలాలు (30) మంగళవారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. తహశీల్దార్ నరేష్, చండూరు సీఐ ఆదిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనుమానం ఉన్న శార్దూల్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సీఐ ఆదిరెడ్డి తెలిపారు.