News August 11, 2024

నల్గొండ: యువతిపై NSUI నాయకుడి దాడి

image

యువతిపై NSUI నాయకుడు దాడి చేసిన ఘటన నల్గొండలో ఆలస్యంగా వెలుగు చూసింది. NSUI నాయకుడు మనిమద్దె సాయిరాం పట్టణంలోని ఓ పాఠశాలలో ట్రైనీ టీచర్‌గా పని చేస్తున్న యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. తోటి ఉపాధ్యాయులు ప్రశ్నించగా వారిని బూతులు తిట్టినట్టు సమాచారం. గతంలో ఇదే యువతి విషయంలో అతనిపై 1 టౌన్ పోలీసు స్టేషన్‌లో బైండోవర్ కేసు ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News February 28, 2026

NLG: ఇంటర్ పరీక్షలు.. నాలుగో రోజు 281 మంది గైర్హాజరు

image

జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 281 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డిఐఈఓ దస్రూనాయక్ తెలిపారు. జనరల్ విభాగంలో మొత్తం 11,050, మంది విద్యార్థులకు గాను 10, 839మంది హాజరుకాగా, 211 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1,884 మంది విద్యార్థులకు గాను 1,814 మంది హాజరుకాగా, 70 మంది గైర్హాజరయ్యారు.

News February 28, 2026

నల్గొండ: మహిళలకు ఉచిత బ్యూటీషియన్ శిక్షణ

image

జిల్లా మహిళా ప్రాంగణంలో ఉచిత బ్యూటీషియన్ శిక్షణ ప్రారంభం కానున్నట్లు మేనేజర్ అనిత తెలిపారు. 18-35 ఏళ్లలోపు వయస్సు ఉండి, కనీసం 8వ తరగతి చదివిన మహిళలు అర్హులు. ఆసక్తి గలవారు రెండు ఫోటోలు, ఆధార్‌ కార్డుతో కార్యాలయంలో సంప్రదించాలి. ఒంటరి మహిళలు, వికలాంగులకు ప్రాధాన్యత ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

News February 28, 2026

నల్లగొండ: 28న జిల్లావ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్

image

జిల్లాలోని అన్ని కోర్టు సముదాయాల్లో ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. రాజీపడదగ్గ క్రిమినల్, చెక్ బౌన్స్, కుటుంబ వివాదాలు, మోటార్ వాహన ప్రమాదాలు, భూ తగాదాలు వంటి పెండింగ్ కేసులను ఇక్కడ పరిష్కరించుకోవచ్చు. దీనివల్ల కక్షిదారులకు సత్వర న్యాయంతో పాటు సమయం, ఖర్చు ఆదా అవుతాయని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్ తెలిపారు. అప్పీలుకు తావులేని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.