News August 11, 2024
నల్గొండ: యువతిపై NSUI నాయకుడి దాడి
యువతిపై NSUI నాయకుడు దాడి చేసిన ఘటన నల్గొండలో ఆలస్యంగా వెలుగు చూసింది. NSUI నాయకుడు మనిమద్దె సాయిరాం పట్టణంలోని ఓ పాఠశాలలో ట్రైనీ టీచర్‌గా పని చేస్తున్న యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. తోటి ఉపాధ్యాయులు ప్రశ్నించగా వారిని బూతులు తిట్టినట్టు సమాచారం. గతంలో ఇదే యువతి విషయంలో అతనిపై 1 టౌన్ పోలీసు స్టేషన్‌లో బైండోవర్ కేసు ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News September 10, 2024
NLG: 10.58 లక్షల ఎకరాల్లో వరి సాగు!
ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరి నాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సీజన్లో మొత్తం 20.83 లక్షల ఎకరాలు సాగు చేయగా.. ఇందులో 90% ప్రస్తుతం పంటలు వేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక్క వరి పంటనే 10.58 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. గత వారం రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు భారీ,మధ్య,చిన్న తరహా ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటలు నిండుకుండలుగా మారాయి.
News September 10, 2024
నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆప్డేట్
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు 12 గేట్లను ఎత్తి 95,490 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 1,38,473 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1,38,473 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589 అడుగులుగా ఉంది.
News September 10, 2024
RRR భూ సేకరణకు మరో ముందడుగు..!
RRR భూ సేకరణకు మరో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు జాతీయ రహదారుల విభాగం వారు కోరినంత స్థలాన్ని అప్పగించేందుకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం నడుం బిగించింది. జిల్లాకు సంబంధించి తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాలకు అదనపు కలెక్టర్, భువనగిరి, చౌటుప్పల్ రెవిన్యూ డివిజన్లకు ఆయా డివిజన్ల ఆర్డీవోలను అధీకృత భూసేకరణ అధికారులుగా నియమించారు.