News March 17, 2025
నల్గొండ: రాముడి ఆలయ నిర్మాణానికి ముస్లిం వ్యక్తి విరాళం

నల్గొండ ప్రజలు భిన్నత్వంలో ఏకత్వం సూత్రం పాటిస్తారని మరోసారి రుజువు చేశాడు ఆ వ్యక్తి.. నల్గొండ జిల్లా నాంపల్లిలో నూతనంగా శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం నిర్మిస్తున్నారు. కాగా ఈ ఆలయ నిర్మాణానికి నాంపల్లి మండలం తిరుమలగిరి వాసి మహమ్మద్ రవూఫ్ చోటే తన వంతు సాయంగా రూ.60,000 విరాళంగా అందజేశారు. దీంతో దేవాలయ కమిటీ ఛైర్మన్ కోట రఘునందన్, కమిటీ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News March 18, 2025
దిల్సుఖ్నగర్లో యువతులతో వ్యభిచారం.. ARREST

సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ యువతులను ఆకర్షించి, విటుల వద్దకు పంపుతున్న నాగమణి అనే మహిళను హ్యూమన్ ట్రాఫికింగ్, సరూర్నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. డెకాయ్ ఆపరేషన్ ద్వారా ఆమెను దిల్సుఖ్నగర్లోని కమలానగర్ వద్ద రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. యువతుల ఫొటోలను వాట్సాప్ ద్వారా కస్టమర్లకు పంపి సినిమా పేరుతో వ్యభిచార రొంపిలోకి దింపుతున్నట్లు గుర్తించారు.
News March 18, 2025
KNR: కొత్త కాన్సెప్ట్కు జిల్లా కలెక్టర్ శ్రీకారం..

KNRలోని కాశ్మీర్ గడ్డ రైతుబజార్ ఒక అరుదైన కార్యక్రమానికి వేదికగా నిలిచింది. ఇక్కడ ఒక వినూత్నమైన కొత్త కాన్సెప్ట్తో కూరగాయల సంతను ఏర్పాటు చేశారు. ఈ కూరగాయల సంతను ఏర్పాటు చేసింది.. రైతులో.. గ్రామీణ ప్రాంత ప్రజలో కాదు..ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న గ్రామీణ ప్రాంత విద్యార్థిని, విద్యార్థులు. కలెక్టర్ పమేలా సత్పతి జిల్లాలో ఎంపిక చేసిన 12ప్రభుత్వ పాఠశాలల నుంచి 60మంది విద్యార్థులతో ఏర్పాటు చేయించారు.
News March 18, 2025
సఖినేటిపల్లి: రెండు ప్రమాదాలు.. ఇద్దరు మృతి

సఖినేటిపల్లి మండలంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. సఖినేటిపల్లి సినిమా హాల్ సెంటర్లో గుడిమూలకు చెందిన పైడిరాజు (23) బైక్పై ఆగి ఉండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. అప్పనరామునిలంకలో సుబ్బారావు (59) బైక్పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయారు. వీటిపై కేసులు నమోదు చేశామని ఎస్ఐ దుర్గా శ్రీనివాస్ తెలిపారు.