News March 17, 2025
నల్గొండ: రాముడి ఆలయ నిర్మాణానికి ముస్లిం వ్యక్తి విరాళం

నల్గొండ ప్రజలు భిన్నత్వంలో ఏకత్వం సూత్రం పాటిస్తారని మరోసారి రుజువు చేశాడు ఆ వ్యక్తి.. నల్గొండ జిల్లా నాంపల్లిలో నూతనంగా శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం నిర్మిస్తున్నారు. కాగా ఈ ఆలయ నిర్మాణానికి నాంపల్లి మండలం తిరుమలగిరి వాసి మహమ్మద్ రవూఫ్ చోటే తన వంతు సాయంగా రూ.60,000 విరాళంగా అందజేశారు. దీంతో దేవాలయ కమిటీ ఛైర్మన్ కోట రఘునందన్, కమిటీ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News December 12, 2025
నరసాపురం నుంచి వందేభారత్

నరసాపురం – చెన్నైకి వందేభారత్ నడిచేందుకు ఈ నెల 15 న ముహూర్తం ఖరారయింది. ప.గో నుంచి ఇదే తొలిసారి కావడంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ రైలు నరసాపురం – విజయవాడ మధ్య నరసాపురం, భీమవరం, గుడివాడలో ఆగుతుంది. కాగా ఇది నరసాపురంలో మ. 2.50కి బయలుదేరి రాత్రి 11.45కు చెన్నైకి చేరుతుంది. తిరిగి ఉ. 5.35కు బయలుదేరి మ.2.10కి నరసాపురంలో ఉంటుంది.
News December 12, 2025
కరీంనగర్: రెండో విడత ఎన్నికలకు రంగం సిద్ధం

మొదటి విడత ఎన్నికలు పూర్తయినందున, రెండో విడత ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. చిగురుమామిడి మండలంలోని 17, తిమ్మాపూర్లో 23, మానకొండూరులో 17, శంకరపట్నం 29, గన్నేరువరం మండలంలో 27 గ్రామపంచాయతీలకు గాను 1046 వార్డు సభ్యుల స్థానాలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
News December 12, 2025
KNR: తాటి గేగులు.. ఆరోగ్య సిరులు!

ప్రకృతి మనకు అందించిన అద్భుతమైన ఆహారాల్లో ‘తాటి గేగులు’ ఒకటి. పల్లెటూర్లలో ఎక్కువగా దొరికే ఈ గేగులు ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు పట్టణాల్లోనూ అందుబాటులో ఉన్నాయి. కేవలం రుచికోసమే కాకుండా, వీటిని తినడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తాటి గేగులలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.


