News March 17, 2025
నల్గొండ: రాముడి ఆలయ నిర్మాణానికి ముస్లిం వ్యక్తి విరాళం

నల్గొండ ప్రజలు భిన్నత్వంలో ఏకత్వం సూత్రం పాటిస్తారని మరోసారి రుజువు చేశాడు ఆ వ్యక్తి.. నల్గొండ జిల్లా నాంపల్లిలో నూతనంగా శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం నిర్మిస్తున్నారు. కాగా ఈ ఆలయ నిర్మాణానికి నాంపల్లి మండలం తిరుమలగిరి వాసి మహమ్మద్ రవూఫ్ చోటే తన వంతు సాయంగా రూ.60,000 విరాళంగా అందజేశారు. దీంతో దేవాలయ కమిటీ ఛైర్మన్ కోట రఘునందన్, కమిటీ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News April 25, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News April 25, 2025
కాజీపేట: భార్య భర్తలు అదృష్యం

కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ కాలనీకి చెందిన భార్య భర్తలు సందీప్ కుమార్(44), మానస(40) 21 రోజుల క్రితం అదృష్యం అయ్యారని కాజీపేట ఎస్సై నవీన్ తెలిపారు. ఈ సందర్భంగా వారి తండ్రి సంపత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరికైనా వీరి ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు.
News April 25, 2025
పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఆ దేశంపై భారత ఉమెన్స్ బేస్‌బాల్ టీమ్ అదరగొట్టింది. ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో 2-1 తేడాతో ఘన విజయం సాధించింది.