News January 3, 2025

నల్గొండ: రిజర్వాయర్‌లో మహిళ మృతదేహం 

image

పెద్దదేవులపల్లి రిజర్వాయర్ అవుట్ పాల్ వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహం కొట్టుకొచ్చినట్లు మాడుగులపల్లి ఎస్ఐ కృష్ణయ్య తెలిపారు. వర్క్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ మాడుగులపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్సై చెప్పారు. నీటిలో పడి రెండు, మూడు రోజులు అయ్యుండొచ్చని ఎస్సై అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీకి తరలించారు.

Similar News

News January 8, 2025

దేవరకొండ: శిశువు మృతి.. బంధువుల ఆందోళన

image

దేవరకొండ ఏరియా ఆసుపత్రిలో నవజాత శిశువు మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దేవరకొండ మం. మర్రిచెట్టు తండాకు చెందిన ఓ గర్భిణి మంగళవారం మధ్యాహ్నం ప్రసవం కోసం ఏరియా ఆసుపత్రికి వచ్చింది. వైద్యులు సాధారణ ప్రసవం కోసం వేచి ఉంచి ఈరోజు తెల్లవారుజామున డెలివరీ చేశారు. కాగా శిశువు మృతిచెందడంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధిత కుటుంబీకులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రిలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.

News January 8, 2025

NLG: ప్రాణాలు తీస్తున్న పొగమంచు!

image

వెన్నులో వణుకు పుట్టించే చలికి పొగమంచు తోడైంది. రాత్రి నుంచి ఉ. 9గంటల దాకా దట్టంగా మంచు కురుస్తుండటంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. రోడ్లపై వాహనాలు కనిపించక పరస్పరం ఢీకొని రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. ఇటీవల నల్గొండలో రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా.. మరోకరికి తీవ్రగాయాలైన విషయం తెలిసిందే. అత్యవసరమైతే తప్ప రాత్రి ప్రయాణాలు చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు.

News January 8, 2025

చైనా మాంజా వాడకం నిషేధం: నల్గొండ ఎస్పీ

image

నల్గొండ జిల్లాలో చైనా మాంజా వాడకం నిషేధించామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. చైనా మాంజా చాలా ప్రమాదకరమని ప్రాణాలు పోయే ప్రమాదం ఉందన్నారు. పతంగులకు నైలాన్, సింథటిక్‌తో చేసిన చైనా మాంజా వాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సరదా కోసం చేసే ఈ పని ప్రాణాల మీదకు తెస్తుందన్నారు.