News November 27, 2024
నల్గొండ రీజీయన్ RTCలో 102 కాంట్రాక్టు ఉద్యోగాలు

మాజీ సైనికులను RTC డ్రైవర్లుగా నియమించాలని రాష్ట్ర ఆర్టీసీ, సైనిక సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. నల్గొండ రీజీయన్లో 102 పోస్టుల్లో కాంట్రాక్టు విధానంలో రిటైర్డ్ సైనికులతో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాయి. ఈ నెల 30 వరకు ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించాయి. ఎంపికైన వారికి నెలకు రూ.26వేల జీతంతో పాటు రోజుకు రూ.150 చొప్పున అలవెన్స్ రూపంలో ఇవ్వనున్నారు.
SHARE IT
Similar News
News December 3, 2025
దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి: కలెక్టర్

దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలో దివ్యాంగులకు నిర్వహించిన క్రీడా పోటీలలో దివ్యాంగులు క్రీడా స్ఫూర్తితో ఆడారని అన్నారు.
News December 3, 2025
చిట్యాల: ఇంటి పన్ను వసూళ్లు రికార్డు

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చిట్యాల మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను వసూళ్లు భారీగా పెరిగాయి. మొత్తం రూ. 13,97,355 వసూలు అయినట్లు ఎంపీడీవో జయలక్ష్మి తెలిపారు. అత్యధికంగా వెలిమినేడులో రూ. 2,70,575 వసూలు కాగా, బొంగోనిచెరువు, గుండ్రాంపల్లిలలో కూడా భారీగా పన్నులు వసూలయ్యాయి. ఎన్నికల కారణంగానే ఈ స్థాయిలో వసూళ్లు పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
News December 3, 2025
మిర్యాలగూడలో అత్యధికం.. అడవిదేవులపల్లిలో అత్యల్పం..!

మిర్యాలగూడ నియోజకవర్గంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ల పర్వం ముగిసింది. మిర్యాలగూడ మండలంలో అత్యధికంగా 360 మంది సర్పంచ్ అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించగా, అతి తక్కువగా అడవిదేవులపల్లి మండలంలో కేవలం 101 మంది అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా వెల్లడించారు.


