News April 1, 2024

నల్గొండ: రూ.3లక్షల నగదు పట్టివేత

image

పెద్దవూర మండలంలో కొండమల్లేపల్లి వైపు నుంచి వచ్చిన వాహనాలను పోలీసులు తనిఖీలు చేశారు. తనిఖీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాకు చెందిన తాతారావు రూ.1.50 లక్షలు, కృష్ణ జిల్లాకు చెందిన ఎర్రగడ్డ నవీన్ రూ.50వేలు, అనకాపల్లి జిల్లాకు చెందిన కొండల దుర్గారావు రూ.1లక్షల నగదుకు ఎలాంటి పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు ఎస్సై వీరబాబు తెలిపారు.

Similar News

News April 24, 2025

NLG: టీపీసీసీ పరిశీలకుల నియామకం!

image

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జిల్లాకు పరిశీలకులను నియమించింది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లాకు మక్తల్ ఎమ్మెల్యే వి.శ్రీహరి ముదిరాజ్, నజీర్ అహ్మద్‌ను పరిశీలకులుగా నియమించింది. వీరు జిల్లాలో ప్రస్తుతం ఉన్న డీసీసీ అధ్యక్షులను కొనసాగించాలా..? లేక కొత్తవారిని నియమించాలా..? అనే దానిపై పార్టీ శ్రేణుల అభిప్రాయాలు సేకరించి అధిష్ఠానానికి నివేదిక సమర్పించనున్నారు.

News April 24, 2025

NLG: రజతోత్సవం పైనే బీఆర్ఎస్ నజర్

image

వరంగల్ సభను బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈనెల 27న జరిగే పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు ఉమ్మడి జిల్లా నుంచి లక్ష మందిని తరలించేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. వరంగల్‌కు సమీప నియోజకవర్గాలైన ఆలేరు, భువనగిరి, సూర్యాపేట, తుంగతుర్తి ప్రాంతాల నుంచి 12,500 మంది చొప్పున 50 వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని పార్టీ నేతలు తెలిపారు.

News April 24, 2025

NLG: వడదెబ్బకు పిట్టల్లా

image

భానుడి భగభగలతో ఉమ్మడి జిల్లా నిప్పుల కుంపటిలా మారింది. రోజురోజుకు ఎండల తీవ్రత అధికమవుతోంది. వడదెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లా చిలుకూరులో ఉపాధి కూలీ కొడారు కోటయ్య (62) మృతి చెందారు. ఇటీవల పానగల్‌కు చెందిన కస్పరాలు కనకయ్య, కేతేపల్లి మండలం తుంగతుర్తి వాసి గుంటి వెంకటరమణ వడదెబ్బతో మృతిచెందారు. ఎండలకు బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

error: Content is protected !!