News May 4, 2024

నల్గొండ: రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపు (REWIND)

image

లోక్‌సభ ఎన్నికలు మరో వారం రోజులుండగానే.. ఇటీవల ఖాళీ అయిన నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ ఎమ్మెల్సీ ఎన్నిక సందడి మొదలైంది. కాగా 2021లో గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా గెలవడంతో తాజా ఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నికల్లో గెలుపుకోసం 1,83,167 ఓట్లు అవసరం కాగా మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ 50శాతానికి మించి రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లతో పల్లా గెలిచారు.

Similar News

News December 11, 2025

హైదరాబాద్ జట్టును ఓడించిన నల్గొండ టీం

image

వనపర్తిలో జరుగుతున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 రాష్ట్ర స్థాయి హాకీ బాలుర పోటీలలో నల్గొండ జిల్లా జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. సెమీఫైనల్‌లో హైదరాబాద్ జట్టును 3-2 గోల్స్ తేడాతో ఓడించింది. రేపు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో నల్గొండ జట్టు మహబూబ్‌నగర్ జట్టుతో తలపడనుంది. జట్టు ప్రదర్శన పట్ల కార్యదర్శి విమల, హాకీ అసోసియేషన్ కార్యదర్శి ఇమామ్ కరీం హర్షం వ్యక్తం చేశారు.

News December 11, 2025

MGUకి 500 కోట్లు మంజూరు చేయాలని విద్యార్థుల డిమాండ్

image

మహాత్మా గాంధీ యూనివర్సిటీ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి 500 కోట్లు మంజూరు చేయాలని గురువారం విద్యార్థులు డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం ప్రకటించిన 1000 కోట్లు స్వాగతించదగ్గదేనిగానీ, ఎంజియు 20 ఏళ్లుగా పీజీ సెంటర్ స్థాయిలోనే ఉందని పేర్కొన్నారు. సిబ్బంది కొరత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దుర్దశ, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల వల్ల భారీ ఫీజులు, పరిశోధనలో వెనుకబాటు సమస్యలను పరిష్కరించాలని అన్నారు.

News December 11, 2025

BREAKING.. ఎల్లమ్మగూడెం సర్పంచ్‌‌గా వాణి సందీప్ రెడ్డి

image

తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన ఊట్కూరి వాణి సందీప్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆమె తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ బలపరిచిన మామిడి నాగలక్ష్మిపై 459 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఘన విజయంతో సర్పంచ్‌ మద్దతుదారులు గ్రామంలో బాణసంచా కాల్చి, డప్పుల మోతతో సంబరాలు నిర్వహించారు.