News July 3, 2024
నల్గొండ: రేపటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన

నల్గొండ జిల్లాలోని 31 మండలాల్లో రేపటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. రాష్ట్రంలో ఇవాళ జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ పదవీ కాలం ముగిసింది. పరిపాలనలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లాలోని 31 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ నల్గొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News October 18, 2025
ఎంత రాత్రి అయినా దరఖాస్తులు తీసుకుంటాం: సంతోష్

మద్యం టెండర్లకు ఇవాళ ఆఖరి రోజు అయినందున దరఖాస్తుదారులు ఇబ్బంది పడకుండా కౌంటర్లు పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్ తెలిపారు. ఇప్పుడు 14 కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకుంటున్నట్లు తెలిపారు. 5 గంటల్లోపు దరఖాస్తులతో వచ్చిన వారి నుంచి ఎంత రాత్రైనా దరఖాస్తులు తీసుకుంటామని తెలిపారు.
News October 18, 2025
NLG: నేడే లాస్ట్ ఛాన్స్.. ఒక్కరోజే 1,387 దరఖాస్తులు

మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఊపందుకున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 1,387 దరఖాస్తులు వచ్చాయి. రాత్రి 8 గంటల వరకూ లైన్లో ఉండి దరఖాస్తులు సమర్పించారు. ఇప్పటివరకు మొత్తం 2,439 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. ఇవాళ సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనుంది.
News October 18, 2025
ఉమ్మడి జిల్లాలో మరో ఆరు కొత్త బ్రాంచులు

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పరిధిలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మరో 6 కొత్త బ్రాంచీల ఏర్పాటుకు ఆర్బీఐ నుంచి అనుమతి వచ్చింది. చిలుకూరు, మోతె, శాలిగౌరారం, నాంపల్లి, పెద్దవూర, మిర్యాలగూడ టౌన్లో 2వ బ్రాంచ్ ఏర్పాటు చేయనున్నట్లు డీసీసీబీ ఛైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఆరు బ్రాంచులతో కలిపి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 47 బ్రాంచీలు అవుతాయని తెలిపారు.