News February 12, 2025
నల్గొండ: రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జు అయిన తల

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. వివరాలిలా.. సూర్యాపేట మండలానికి చెందిన మల్లమ్మ ఆటో చెట్టుకి ఢీకొనడంతో మృతిచెందింది. HYDకి చెందిన ఇస్లాం WGL వెళ్తున్న క్రమంలో బైక్‌ను కారు ఢీకొట్టడంతో మరణించాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తల నుజ్జునుజ్జు అయి మహిళ మృతి చెందింది. ఈఘటన అడ్డగూడురులో జరిగింది. ఆమె దాచారం ZPHS పాఠశాల టీచర్ జబీన్‌గా పోలీసులు గుర్తించారు.
Similar News
News November 4, 2025
ద్వారకాతిరుమల: శ్రీవారి హుండీ ఆదాయం లెక్కింపు

ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ హుండీల నగదు లెక్కింపు ప్రమోద కళ్యాణ మండపంలో మంగళవారం నిర్వహించారు. 41 రోజులకు జరిపిన ఈ లెక్కింపులో స్వామివారికి రూ.4,22,31,799 ల నగదు, 569 గ్రాముల బంగారం, 7.708 కేజీల వెండి వచ్చినట్లు ఆలయ ఈఓ NVSN మూర్తి తెలిపారు. ఈ లెక్కింపులో అధికంగా విదేశీ కరెన్సీతో పాటు, రద్దైన పాత కరెన్సీ కూడా వచ్చిందన్నారు.
News November 4, 2025
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 519 పాయింట్ల నష్టంతో 83459 వద్ద ముగియగా, నిఫ్టీ 165 పాయింట్లు కోల్పోయి 25597 వద్ద సెటిలైంది. పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, బజాజ్ ఆటో టాప్ లూజర్స్. టైటాన్, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్, ఎం&ఎం, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ లాభపడ్డాయి. కన్‌జ్యూమర్ డ్యూరబుల్స్, టెలికాం మినహా తక్కిన సెక్టార్ల స్టాక్స్ అన్నీ ఎరుపెక్కాయి.
News November 4, 2025
హిందూజా గ్రూప్ ఛైర్మన్ మృతి

హిందూజా గ్రూప్ ఛైర్మన్, ఇండియన్-బ్రిటిష్ బిలియనీర్ గోపీచంద్ హిందూజా (85) కన్నుమూశారు. ఈ విషయాన్ని బ్రిటిష్ హౌస్ ఆఫ్ లార్డ్స్ మెంబర్ రామీ రేంజర్ వెల్లడించారు. గోపీచంద్ మరణంతో ఒక శకం ముగిసిందని, ఆయన సమాజ శ్రేయోభిలాషి, మార్గదర్శక శక్తి అని పేర్కొన్నారు. కొన్ని రోజులుగా అనార్యోగంతో బాధపడుతున్న ఆయన లండన్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది.


