News February 12, 2025
నల్గొండ: రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జు అయిన తల

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. వివరాలిలా.. సూర్యాపేట మండలానికి చెందిన మల్లమ్మ ఆటో చెట్టుకి ఢీకొనడంతో మృతిచెందింది. HYDకి చెందిన ఇస్లాం WGL వెళ్తున్న క్రమంలో బైక్‌ను కారు ఢీకొట్టడంతో మరణించాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తల నుజ్జునుజ్జు అయి మహిళ మృతి చెందింది. ఈఘటన అడ్డగూడురులో జరిగింది. ఆమె దాచారం ZPHS పాఠశాల టీచర్ జబీన్‌గా పోలీసులు గుర్తించారు.
Similar News
News January 8, 2026
ఆర్టీఐ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి: అదనపు కలెక్టర్

పారదర్శకమైన, బాధ్యతాయుతమైన పాలన అందించడంలో సమాచార హక్కు చట్టం కీలకమని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య పేర్కొన్నారు. నస్పూర్ కలెక్టరేట్లో వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఆర్టీఐ రిజిస్టర్లను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సరైన నివేదికల నిర్వహణ ద్వారా జవాబుదారీతనం పెరుగుతుందని అన్నారు.
News January 8, 2026
రంగంపల్లి వీ-హబ్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

పెద్దపల్లి మండలం రంగంపల్లిలో నిర్మాణంలో ఉన్న వీ-హబ్ నూతన భవనాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే శిక్షణ, అవగాహన కార్యక్రమాలకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. శిక్షణకు అవసరమైన ఫర్నిచర్, పరికరాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. పర్యటనలో డీఆర్డీఓ కాళిందిని, పంచాయతీరాజ్ ఏఈ పవన్ పాల్గొన్నారు.
News January 8, 2026
పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స విజయవంతం

PDPL ప్రభుత్వ ఆసుపత్రిలో 46 ఏళ్ల మహిళ గాల్ బ్లాడర్‌లో 14mm స్టోన్‌తో బాధపడుతుండగా లాప్రోస్కోపిక్ కొలాసిస్టెక్టమీ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. లాప్రోస్కోప్ సర్జన్ డా.అమరసింహా రెడ్డి నేతృత్వంలో వైద్యబృందం ఈ ఆపరేషన్ చేపట్టింది. పాల్గొన్న వైద్యులను ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.శ్రీధర్ అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు


