News August 10, 2024
నల్గొండ లతీఫ్ సాహెబ్ గుట్టపై సూసైడ్
నల్గొండలోని లతీఫ్ సాహెబ్ గుట్టపై గుర్తుతెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి చేతికి వాచ్, ఎడమ చెవికి రింగు ఉందని వారు తెలిపారు. ఘటనా స్థలంలో చెప్పులు, బ్యాగు, పర్సు ఉన్నాయన్నారు. మృతుడిని గుర్తిస్తే నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నంబర్ 87126 70141కు సమాచారం ఇవ్వాలన్నారు.
Similar News
News September 10, 2024
నల్గొండ: ‘వస్త్ర నిల్వలను కొనుగోలు చేసి ఆదుకోవాలి’
వస్త్ర నిల్వలను కొనుగోలు చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల దగ్గర, సహకార సంఘాల దగ్గర పేరుకుపోయిన వస్త్రాల నిల్వలను ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయాలని ఆయన కోరారు. జిల్లా కేంద్రంలోని సిపిఎం ఆఫీస్ లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. 280 కోట్ల బకాయిలు, 30 కోట్ల రుణమాఫీ నిధులు విడుదల పట్ల హర్షం వ్యక్తం చేశారు.
News September 10, 2024
NLG: 10.58 లక్షల ఎకరాల్లో వరి సాగు!
ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరి నాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సీజన్లో మొత్తం 20.83 లక్షల ఎకరాలు సాగు చేయగా.. ఇందులో 90% ప్రస్తుతం పంటలు వేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక్క వరి పంటనే 10.58 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. గత వారం రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు భారీ,మధ్య,చిన్న తరహా ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటలు నిండుకుండలుగా మారాయి.
News September 10, 2024
నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆప్డేట్
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు 12 గేట్లను ఎత్తి 95,490 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 1,38,473 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1,38,473 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589 అడుగులుగా ఉంది.