News March 17, 2025

నల్గొండ: వచ్చే నెల నుంచే సన్న బియ్యం: మంత్రి ఉత్తమ్

image

తుంగతుర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన అభినందన సభకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటుంది అన్నారు. వచ్చే నెల నుంచి సన్న బియ్యం ఇస్తున్నామని, కాంగ్రెస్ మాటలు చెప్పేది కాదు, చేతల్లో చూపెడుతుందని అన్నారు. శాసనసభలో ఎస్సీ వర్గీకరణ చట్టం చేయబోతున్నామని అన్నారు.

Similar News

News December 10, 2025

నల్గొండ: అప్పులు.. పదవి కోసం తిప్పలు

image

నల్గొండ జిల్లాలోని 869 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవి కోసం అభ్యర్థులు ఎనలేని సాహసం చేస్తున్నారు. ఆర్థిక స్తోమత సరిగా లేకున్నా, తర్వాత సంపాదించుకోవచ్చనే ఆశతో అప్పులు చేసి మరీ ఎన్నికల్లో నిలిచారు. ప్రస్తుతం పంటల దిగుబడి అంతంత మాత్రంగా ఉండటంతో, రెండో పంట వచ్చాక తిరిగి చెల్లిస్తామనే హామీతో అప్పులు తీసుకుని ప్రచారానికి ఖర్చు చేస్తున్నారు. ఈ అప్పుల పోరు ఎన్నికల వాతావరణాన్ని మరింత రంజుగా మారుస్తోంది.

News December 10, 2025

పంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ భద్రత: ఎస్పీ శరత్ చంద్ర పవార్

image

జిల్లా పరిధిలోని మూడు దశల్లో 869 గ్రామపంచాయతీలో జరిగే ఎన్నికలకు 1,680 పోలీస్ సిబ్బందితో పటిష్ఠ భద్రత ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. గ్రామాల్లో ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే 100కి సమాచారం అందించాలని కోరారు.

News December 9, 2025

గ్రామ పోరుకు సిద్ధం.. ‘నల్గొండలో ఏర్పాట్లు పూర్తి’

image

జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ ఈ విషయాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని దృష్టికి తీసుకెళ్లారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్, పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్‌ వివరాలను నిర్ణీత సమయాల్లో ‘టీ-పోల్‌’లో నమోదు చేయాలని ఈసీ ఆదేశించారు.