News May 3, 2024

నల్గొండ: వడదెబ్బతో రైతు మృతి

image

నల్గొండ జిల్లా తిప్పర్తి మండల పరిధిలోని తిప్పలమ్మ గూడెం గ్రామానికి చెందిన రైతు వడదెబ్బతో గురువారం మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిని వివరాలు.. తోట జాన్ రెడ్డి వ్యవసాయ పనుల ముగించుకొని సాయంత్రం ఇంటికి చేరారు. ఎండదెబ్బతో తీవ్ర అలసటకు గురై మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు.

Similar News

News January 3, 2025

భువనగిరి కలెక్టరేట్‌కు నామినేషన్ పత్రాలు 

image

త్వరలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ పత్రాలు భువనగిరి కలెక్టరేట్‌‌కు చేరుకున్నాయి. కాగా ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఓటర్ల తుది జాబితా ప్రకటించామని ఏ క్షణంలోనైనా ఎన్నికలకు వెళ్లే పరిస్థితి ఉండడంతో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కాగా ఎన్నికలకు 12 మంది నోడల్ అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు.

News January 2, 2025

జిల్లాను మొదటి స్థానంలో నిలిపారు: త్రిపాఠి

image

జిల్లాలో సమర్థవంతులైన బాధ్యత కలిగిన అధికారులు, సిబ్బంది ఉన్నారని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో నూతన సంవత్సర సందర్భంగా జిల్లా అధికారులు, సిబ్బంది కలెక్టర్‌ను గురువారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గత సంవత్సరం ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇళ్లు, సమగ్ర కుటుంబ సర్వే వంటి అంశాలలో జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని ఇందుకు కృషి చేసిన మండల ప్రత్యేక అధికారులు,అధికారులను అభినందించారు.

News January 2, 2025

NLG: ఇంటర్ విద్యార్థి సూసైడ్ 

image

పేరెంట్స్ మందలించడంతో ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన మర్రిగూడ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. శివన్నగూడెంకు చెందిన గణేశ్ ఇంటర్ చదువుతున్నాడు. టైం అవుతోందని కాలేజీకి వెళ్లమని గణేశ్ తండ్రి ఇంద్రయ్య మందలించాడు. మనస్తాపంతో పొలం దగ్గర పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు.