News April 24, 2024
నల్గొండ వర్సెస్ భువనగిరి

నల్గొండ, భువనగిరి స్థానాలు కాంగ్రెస్ నేతలకు సవాల్‌గా మారాయి. నల్గొండ వర్సెస్ భువనగిరి మధ్య జరుగుతున్న పోటీగానే కాంగ్రెస్ భావిస్తోంది. భువనగిరిలో 4లక్షల మెజార్టీ సాధించాలని ఆ బాధ్యత రాజగోపాల్రెడ్డిపైనే ఉందని మంత్రి వెంకట్‌రెడ్డి చెప్పారు. అటు నల్గొండలో దేశంలోనే భారీ మెజార్టీ సాధిస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇద్దరు మంత్రులు భారీ మోజార్టీ సాధిస్తామని శపథం చేయడం ఆసక్తిగా మారింది.
Similar News
News February 28, 2026
తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి: కలెక్టర్ ఆదేశం

ఎండాకాలంలో ప్రజలకు, పశువులకు తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛంద సంస్థల సహకారంతో పలుచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. 100 రోజుల కార్యచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేసి, తాగునీటి సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పురోగతి సాధించాలని స్పష్టం చేశారు.
News February 28, 2026
నల్గొండలో ఉపాధి నిధుల రాజకీయం

నల్గొండ ఉమ్మడి జిల్లాకు ఉపాధి హామీ పథకం కింద మంజూరైన రూ. 211.36 కోట్ల నిధుల పంపిణీ ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. గత రెండేళ్లుగా నిధుల కొరతతో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్సీలు తమ వాటా కోసం పట్టుబడుతుండటమే దీనికి కారణం. గతంలో మంత్రి కోమటిరెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా మధ్య జరిగిన మాటల యుద్ధం నేపథ్యంలో, తాజా నిధుల కేటాయింపు అంశం ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
News February 27, 2026
NLG: ఇంటర్ పరీక్షలు.. మూడోరోజు 339 మంది గైర్హాజరు

జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 339 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డిఐఈఓ దస్రూనాయక్ వెల్లడించారు. జనరల్ విభాగంలో మొత్తం 11,751 మంది విద్యార్థులకు గాను 11,535 మంది హాజరుకాగా, 216 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1,566 మంది విద్యార్థులకు గాను 1,443 మంది హాజరుకాగా, 123 మంది గైర్హాజరయ్యారు.


