News April 24, 2024

నల్గొండ వర్సెస్ భువనగిరి

image

నల్గొండ, భువనగిరి ​స్థానాలు కాంగ్రెస్​ నేతలకు సవాల్​గా మారాయి. నల్గొండ వర్సెస్ ​భువనగిరి మధ్య జరుగుతున్న పోటీగానే కాంగ్రెస్​ భావిస్తోంది. భువనగిరిలో 4లక్షల మెజార్టీ సాధించాలని ఆ బాధ్యత రాజగోపాల్​రెడ్డిపైనే ఉందని మంత్రి వెంకట్​రెడ్డి చెప్పారు. అటు నల్గొండలో దేశంలోనే భారీ మెజార్టీ సాధిస్తామని ఉత్తమ్​కుమార్​రెడ్డి అన్నారు. ఇద్దరు మంత్రులు భారీ మోజార్టీ సాధిస్తామని శపథం చేయడం ఆసక్తిగా మారింది.

Similar News

News January 18, 2025

NLG: నేడు జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష

image

ఉమ్మడి జిల్లాలో జవహర్ నవోదయ (ఆరో తరగతి) ప్రవేశ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 27 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. NLG జిల్లాలో 13, BNGలో 5, SRPT జిల్లాలో 9 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. చలకుర్తి జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో 80 సీట్లు ఉన్నాయనీ ప్రిన్సిపాల్ నాగభూషణం తెలిపారు. 80 సీట్లలో 75% గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు.

News January 18, 2025

ఈ నెల 21న నల్గొండకు కేటీఆర్

image

నల్గొండకు ఈ నెల 21 బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన రైతు మహాసభలో పాల్గొననున్నారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో పార్టీ నాయకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ ఓటమి తరువాత నల్గొండ టౌన్‌కు కేటీఆర్ రావడం ఇదే మొదటిసారి. కాగా ఈ నెల 13న నిర్వహించాల్సిన రైతు మహాసభ వివిధ కారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే.

News January 18, 2025

BREAKING: సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

image

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. SV కళాశాల సమీపంలో రెండు ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో క్లినర్ బస్సు అద్దంలో నుంచి ఎగిరిపడగా.. అతడి పైనుంచి బస్సు వెళ్లడంతో స్పాట్‌లోనే చనిపోయాడు. గుండెపోటుతో ప్రయాణికుడు మృతిచెందాడు. మృతిచెందిన వారు గుంటూరువాసులు సాయి, రసూల్‌గా పోలీసులు గుర్తించారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. రెండు బస్సులు గుంటూరు నుంచి HYD వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.