News September 10, 2024
నల్గొండ: ‘వస్త్ర నిల్వలను కొనుగోలు చేసి ఆదుకోవాలి’
వస్త్ర నిల్వలను కొనుగోలు చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల దగ్గర, సహకార సంఘాల దగ్గర పేరుకుపోయిన వస్త్రాల నిల్వలను ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయాలని ఆయన కోరారు. జిల్లా కేంద్రంలోని సిపిఎం ఆఫీస్ లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. 280 కోట్ల బకాయిలు, 30 కోట్ల రుణమాఫీ నిధులు విడుదల పట్ల హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News October 4, 2024
ఉమ్మడి జిల్లాలో పలువురు ఎస్సైలు బదిలీ
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఎస్సైలను బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు వాడపల్లి ఎస్సైగా పనిచేస్తున్న ఈడుగు రవి, హాలియా ఎస్సై సతీష్ రెడ్డిలను నల్లగొండ ఎస్పీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు. అదే విధంగా సూర్యాపేట జిల్లాలోని పెన్ పహాడ్ ఎస్సై రవీందర్, ఆత్మకూరు(ఎస్) ఎస్సై వై.సైదులు, తుంగతుర్తి ఎస్సై ఏడుకొండలును ఎస్పీ ఆఫీసుకు అటాచ్ చేశారు.
News October 3, 2024
నల్గొండ: ఈనెల 14 వరకు డీజేల వినియోగంపై నిషేధం: ఎస్పీ
నల్గొండ జిల్లా పరిధిలో ఈనెల 14 వరకు కలెక్టర్ ఉత్తర్వుల మేరకు బహిరంగ ప్రదేశాల్లో ఉపయోగించే DJలతో సహా అధిక వాల్యూమ్ సౌండ్ ఎమిటింగ్ సిస్టమ్‌ల వినియోగంపై నిషేధం విధిస్తూన్నట్లు జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ తెలిపారు.బహిరంగ ప్రదేశాల్లో డీజేలు నుంచి ఉత్పన్నమయ్యే అధిక డెసిబెల్స్ కారణంగా మానవ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యంపై ప్రభావాలు పడుతున్న కారణంగా నిషేధించినట్లు ఎస్పీ వెల్లడించారు.
News October 3, 2024
దేవరకొండ దాబాలో వ్యక్తి మృతి
దేవరకొండలో – డిండి రోడ్డులో గల దాబాలో పని చేసే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దాబా నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.