News August 11, 2024

నల్గొండ: వారంలోనే పెళ్లి.. నిద్రలోనే యువకుడి మృతి

image

వారం రోజుల్లో వివాహం.. నిద్రలో యువకుడు మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా నిడమనూరు(M) ముప్పారంలో జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి వాసి శివ(25) పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈనెల 18న శివకు వివాహం నిశ్చయమైంది. శనివారం పెళ్లి బట్టలు కోసం తల్లి ఉదయాన్నే శివను లేపేందుకు ప్రయత్నించగా లేవలేదు. దీంతో వారు చనిపోయినట్లు నిర్ధారించుకున్నారు. కాగా, శివ మృతికి గల కారణాలు తెలియరాలేదు.

Similar News

News February 26, 2026

NLG: ఇంటర్ పరీక్షలు.. రెండో రోజు 286 మంది డుమ్మా..!

image

జిల్లాలో రెండో రోజు జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 286 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డిఐఈఓ దస్రూనాయక్ వెల్లడించారు. జనరల్ విభాగంలో మొత్తం 11,480 మంది విద్యార్థులకు గాను 11,265 మంది హాజరుకాగా, 215 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1,637 మంది విద్యార్థులకు గాను 1,566 మంది హాజరుకాగా, 71 మంది గైర్హాజరయ్యారు.

News February 26, 2026

నల్గొండ: మద్యపాన నిషేధ అమలుకు తీర్మానం

image

నార్కట్‌పల్లి మండలం షాపల్లి, అమ్మనబోలు గ్రామాలు బెల్ట్ షాపులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. షాపల్లిలో ఈ నెల 26 నుంచి, అమ్మనబోలులో మార్చి 1 నుంచి బెల్టు దుకాణాల నిర్వహణపై కఠిన చర్యలు చేపడతామని పాలకమండలి తీర్మానం చేసింది. గ్రామస్థుల ఆరోగ్య సంరక్షణ కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇతర పల్లెలు స్వాగతిస్తున్నాయి. ఈ సామాజిక మార్పు ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

News February 25, 2026

దేవరకొండ: ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన డీసీహెచ్‌ఎస్

image

జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయకర్త డా.మాతృనాయక్ బుధవారం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రికార్డులు, ల్యాబ్ పరీక్షలను పరిశీలించి, ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్యంపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. సూపరింటెండెంట్ డా. రవిప్రకాశ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.