News August 11, 2024

నల్గొండ: వారంలో పెళ్లి.. గుండెపోటుతో మృతి

image

వారంలో పెళ్లి ఉందనగా గుండెపోటుతో యువకుడు మృతిచెందిన ఘటన నిడమనూరు మండలం ముప్పారంలో జరిగింది. మృతుడి బంధువులు తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన శంకరయ్య, పద్మల కుమారుడు శివకుమార్(23) ఇంట్లో శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రించాడు. శనివారం ఉదయం వచ్చి లేపినా లేవలేదు. నిద్రలో గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు గుర్తించారు. శివ వివాహం ఈనెల 18న జరగాల్సి ఉంది.

Similar News

News September 13, 2024

ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురణ: జిల్లా కలెక్టర్

image

ఇవాళ ఫొటో ఓటరు జాబితాను ఆయా గ్రామపంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాలలో ప్రచురించనున్నట్లు నల్గొండ కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ముసాయిదా ఫొటో ఓటరు జాబితాపై ఈనెల 18న జిల్లా స్థాయిలో ఎన్నికల అథారిటీ, 19న మండల స్థాయిలో MPDOలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.

News September 13, 2024

ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి : కలెక్టర్

image

ఈనెల 17న ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. ప్రజాపాలన దినోత్సవ ఏర్పాట్లపై గురువారం అయన జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కేంద్రం మొదలుకొని గ్రామపంచాయతీ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, గ్రామపంచాయతీలలో జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కలెక్టర్ తెలిపారు.

News September 12, 2024

‘ఆ లక్ష్యం సాధించేందుకు సెలవు దినాలలో సైతం పనిచేయాలి’

image

కష్టమ్ మిల్లింగ్ రైస్ లక్ష్యాన్ని సాధించేందుకు సెలవు దినాలలో సైతం పనిచేయాలని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులను కోరారు. గురువారం ఆయన తన చాంబర్లో 2023- 24 కస్టమ్ మిల్లింగ్ రైస్ పై రైస్ మిల్లర్లు, పౌరసరఫరాలు, ఎఫ్సిఐ అధికారులతో సమీక్షించారు. 2023 -24 ఖరీఫ్, రబీకి సంబంధించిన సీఎంఆర్‌ను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెలాఖరు వరకు గడువు విధించిందని తెలిపారు.