News October 15, 2024

నల్గొండ: విద్యుత్ శాఖలో ముగిసిన బదిలీల ప్రక్రియ

image

నల్గొండ జిల్లాలో విద్యుత్ శాఖ మూడు డివిజన్ల పరిధిలో బదిలీల ప్రక్రియ ముగిసింది. 34 మంది లైన్ ఇన్‌స్పెక్టర్లు, 126 మంది లైన్మెన్లు, 30 మంది అసిస్టెంట్ లైన్మెన్లు, ఇద్దరు జూనియర్ లైన్మెన్లు బదిలీ అయ్యారు. నల్గొండ డీఈ (ఆపరేషన్) అన్నమయ్య పదోన్నతి పై హైదరాబాద్ నుంచి నల్గొండకు వచ్చారు. నల్గొండలో పనిచేస్తున్న వెంకటేశ్వర్లు భువనగిరికి బదిలీ అయ్యారు.

Similar News

News November 27, 2025

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఉన్నతాధికారులు

image

నల్గొండ: సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు ఐఏఎస్ అధికారిణి కొర్ర లక్ష్మీ గురువారం పలు కేంద్రాలను సందర్శించారు. నార్కట్‌పల్లి గ్రామ పంచాయతీ, చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఆమెతో పాటు కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ అమిత్ నారాయణ, ఆర్డీఓ అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు.

News November 27, 2025

NLG: ఇక్కడ మహిళలే కీలకం

image

సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఆశావహులు ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే పురుషులతో పోలిస్తే ఉమ్మడి జిల్లాలో మహిళా ఓటర్లు 28 వేల పైచిలుకు అధికంగా ఉన్నారు. వీరిని ప్రసన్నం చేసుకుంటే గెలుపు ఖాయమని భావిస్తున్నారు. అలాగే గంపగుత్త ఓట్ల కోసం కులసంఘాల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు.

News November 27, 2025

NLG: రైతు పత్తికే వంక!… రైతన్నల అవస్థలు

image

దళారుల చేతుల్లో పత్తి మిల్లులు ఉండటంతో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. కొండమల్లెపల్లి, కట్టంగూరు, చండూరు మండలాల పరిధిలోని జిన్నింగ్‌ మిల్లులలో విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారులు మిల్లుకు తెచ్చిన పత్తిని ఎలాంటి వంకలు పెట్టకుండా కొనుగోలు చేస్తున్నారని, రైతులు తెచ్చిన పత్తికి నానా వంకలు పెడుతున్నారని తెలిపారు.