News November 26, 2024
నల్గొండ: వియత్నాం అమ్మాయితో తెలుగు అబ్బాయి పెళ్లి

చండూరుకి చెందిన పాంపాటి భాస్కర్ శోభ దంపతుల మొదటి కుమారుడు ఉద్యోగరీత్యా 2017లో వియత్నం వెళ్లారు. అక్కడ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ.. అక్కడే హోటల్స్ స్థాపించి వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వంలో యూత్ మినిస్ట్రీ సెక్రటరీగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అమ్మాయి నీనా పరిచయం కావడం అది కాస్తా ప్రేమగా మారి, పెళ్లి చేసుకున్నారు. చండూరులో వారి పెళ్లి జరిగింది.
Similar News
News January 5, 2026
NLG: అమ్మ బాబోయ్.. కేజీ రూ.300లా!

నల్గొండ జిల్లాలో చికెన్ రేటు ట్రిపుల్ సెంచరీ కొట్టింది. కిలో మాంసం రూ.300కి చేరడంతో మాంసం ప్రియులు బెంబేలెత్తుతున్నారు. గుడ్డు ధర రూ.8.50 ఉండగా.. లైవ్ కోడి రూ.185, స్కిన్‌లెస్ రూ.290-310 పలుకుతోంది. బర్డ్ ఫ్లూతో ఉత్పత్తి తగ్గిందని, అందుకే రేట్లు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. పండగ పూట ముక్క లేకపోతే ఎలా అని మాంసం ప్రియులు వాపోతుండగా, రేట్లు ఇప్పట్లో దిగిరావని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
News January 5, 2026
NLG: టెట్ అభ్యర్థులకు తప్పని తిప్పలు

టెట్ అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల కేటాయింపు ఇబ్బందిగా మారింది. మొదటి రోజే అప్లై చేసినా, ప్రాధాన్యత క్రమంలోని చివరి పట్టణాల్లో కేంద్రాలు కేటాయించడంతో అభ్యర్థులు వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో ఒక రోజు ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. జిల్లా నుంచి 1,557 మంది ఉపాధ్యాయులతో సహా సుమారు 3 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 4న ప్రారంభమైన పరీక్షలు 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
News January 5, 2026
నల్గొండలో జిల్లాలో బీసీ వర్సెస్ రెడ్డి

నల్గొండ జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ ఏర్పాటు వ్యవహారం పార్టీలో సెగలు పుట్టిస్తోంది. అధ్యక్షుడిగా పున్నా కైలాస్ నియామకం తర్వాత కమిటీ కూర్పుపై కసరత్తు మొదలవ్వగా.. పదవుల కోసం ఆశావాహులు భారీగా క్యూ కడుతున్నారు. ప్రధానంగా రెడ్డి, బీసీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు ‘హస్తం’ రాజకీయాలను వేడెక్కిస్తోంది. సామాజిక సమీకరణల మధ్య సమతూకం పాటించడం అధిష్ఠానానికి కత్తిమీద సాములా మారింది.


