News February 12, 2026

నల్గొండ: వృద్ధురాలిపై యువకుడి లైంగిక దాడి

image

మర్రిగూడ మండలంలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. ఒంటరిగా నివసిస్తున్న 70 ఏళ్ల వృద్ధురాలిపై 23 ఏళ్ల యువకుడు మద్యం మత్తులో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మర్రిగూడ ఎస్సై కృష్ణారెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని పట్టుకుని స్టేషన్‌కు తరలించారు.

Similar News

News March 9, 2026

సంగారెడ్డి: ‘ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలి’

image

రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ సోమవారం తెలిపారు. పట్టా పాస్ పుస్తకం ఆధార్ కార్డు తీసుకొని మండల వ్యవసాయ శాఖ అధికారుల వద్దకు వెళ్తే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని పేర్కొన్నారు.

News March 9, 2026

చమురు భగభగ.. 120 డాలర్లకు చేరిన బ్యారెల్!

image

మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్స్‌‌తో క్రూడ్ ఆయిల్ ధర ఒక్క రోజులో 29% పెరిగింది. రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో 2022లో చివరగా ఈ రేంజ్ హైక్ నమోదైంది. UAE ముర్బాన్ క్రూడ్ బ్యారెల్ (159L) ధర $120కు, వెస్ట్ టెక్సాస్ $115, బ్రెంట్ క్రూడ్ $116కు చేరాయి. ఇరాక్, కువైట్, UAEలో చమురు ఉత్పత్తి తగ్గడంతో ధరలకు రెక్కలొచ్చాయి. ఇరాక్‌లో రోజుకు 4.3M బ్యారెల్స్‌గా ఉండే ఉత్పత్తి 1.8 మిలియన్లకు పడిపోయింది.

News March 9, 2026

పి.గన్నవరం: గోదావరిలో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం

image

యానాం–ఎదురులంక వంతెనపై సోమవారం ఉదయం ఓ మహిళ గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే, అదే సమయంలో నదిలో చేపల వేట సాగిస్తున్న జాలర్లు ఆమె కేకలు విని అప్రమత్తమయ్యారు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆమెను చాకచక్యంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు. సమయస్ఫూర్తితో స్పందించి ఒక ప్రాణాన్ని నిలిపిన జాలర్లను స్థానికులు అభినందించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.