News November 14, 2024
నల్గొండ: వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో ముగ్గురు మృతి
ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. వివరాలిలా.. రామన్నగూడెం వాసి రాములు(59) తుంగతుర్తి శివారులో బైక్ ఢీకొట్టడంతో మృతిచెందారు. అటు రంగారెడ్డి జిల్లాకి చెందిన అభిలాశ్(24) చౌటుప్పల్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో చనిపోయాడు. తిప్పర్తి (M) మల్లేవారిగూడానికి చెందిన కొండయ్య పొలం పనికి వెళ్తున్న క్రమంలో మిర్యాలగూడ వైపు వెళ్తున్న కారు ఢీకొనడంతో స్పాట్‌లో మృతిచెందాడు.
Similar News
News December 6, 2024
NLG: గ్రామపంచాయతీ ఎన్నికలకు కసరత్తు
నల్గొండ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను అధికారులు ముమ్మరం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయా గ్రామాల్లో ఇప్పటికే ప్రచురించిన ఓటరు జాబితా ఆధారంగా పోలింగ్ కేంద్రాల గుర్తింపు చేపట్టారు. రెండ్రోజులుగా సంబంధిత ఎంపీడీఓలు, ఎంపీఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
News December 6, 2024
NLG: ముగిసిన జీఎన్ఎమ్ పరీక్షలు
NOV 25న ప్రారంభమైన GNM పరీక్షలు గురువారంతో ముగిశాయని నల్గొండ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీవాణి ఒక ప్రకటనలో తెలిపారు. నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రాధాకృష్ణ పర్యవేక్షణలో ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించిన సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
News December 6, 2024
NLG: ఆయిల్ పామ్‌పై పెరుగుతున్న ఆసక్తి!
రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తుండటంతో ఉమ్మడి జిల్లా రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఏడాదిలో రెండింతల సాగు పెరిగినట్లు అధికారులు తెలిపారు. వరికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించే లక్ష్యంతో ఆయిల్‌పామ్ సాగుచేసే రైతులకు రాయితీలు ఇస్తోంది. కంపెనీలు గ్యారెంటీ ధరలతో రైతుల వద్ద దిగుబడులను కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఆయిల్ పాం సాగువైపు దృష్టి సారించారు.