News March 10, 2025
నల్గొండ: శంకర్ నాయక్ రాజకీయ నేపథ్యం ఇదే..

NSUI యూత్ కాంగ్రెస్ నేతగా కెతావత్ శంకర్ నాయక్ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఈయన 90లలో అప్పటి నల్గొండ డీసీసీ అధ్యక్షుడు రాగ్యానాయక్ అనుచరుడిగా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి సర్పంచ్గా గెలిచారు. సీనియర్ పార్టీ నేత జానారెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. తర్వాత ఉమ్మడి దామరచర్లకి ఎంపీపీ, జడ్పీటీసీగా చేశారు. మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసి ప్రస్తుతం NLG డీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
Similar News
News October 20, 2025
NLG: టార్గెట్ రీచ్ అవుతారా..!

మద్యం షాపుల టెండర్లకు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించినా మద్యం వ్యాపారుల నుంచి అంతగా స్పందన కానరావడం లేదు. జిల్లాలో 154 మద్యం దుకాణాలకు సర్కారు ఆశించిన దానికంటే తక్కువ సంఖ్యలో (4,620) దరఖాస్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది 155 దుకాణాలకు 7,057 దరఖాస్తులు వచ్చాయి. ఎలాగైనా టార్గెట్ చేరుకోవాలనే సంకల్పంతో ఎక్సైజ్ శాఖ క్షేత్రస్థాయిలో పావులు కదుపుతోంది.
News October 20, 2025
NLG: అమ్మో ఈ ఆలయాలకు వెళ్లాలంటేనే..

జిల్లాలో ఈజీ మనీ కోసం ట్రాన్స్ జెండర్లు వీరంగం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా పలు ఆలయాల వద్ద తిష్ట వేస్తున్న ట్రాన్స్జెండర్లు భక్తుల నుంచి అడ్డగోలుగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. నిడమనూరు(M) కోట మైసమ్మ, కనగల్(M) దర్వేశిపురం ఆలయాల వద్ద అమ్మవార్లకు మొక్కుబడులు చెల్లించేందుకు, కొత్త వాహనాలకు పూజలు చేసుకునేందుకు వచ్చిన భక్తుల వద్దకు గుంపులుగా చేరుకొని ట్రాన్స్జెండర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.
News October 20, 2025
మంత్రి కోమటిరెడ్డి దీపావళి విషెస్

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళిని ‘జ్ఞాన వెలుగులు నింపే పండుగ’గా ఆయన అభివర్ణించారు. దీపాలు చీకటిని తరిమినట్టుగానే, ఈ పండుగ ప్రజల జీవితాల్లోని అజ్ఞానమనే చీకటిని తొలగించి, నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. లక్ష్మీదేవి కృపాకటాక్షాలు ప్రతి ఇంట్లో సకల శుభాలు కలిగించాలని కోరారు.