News March 14, 2025

నల్గొండ: శిశు మరణాలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

image

శిశు మరణాలు లేని జిల్లాగా నల్గొండను తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ కోరారు. గురువారం ఆమె ఉదయాదిత్య భవన్లో మిర్యాలగూడ డివిజన్ పరిధిలో శిశు మరణాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. ప్రసవానంతరం వివిధ కారణాలవల్ల శిశువులు చనిపోవడాన్ని తగ్గించాలని, ఇందుకు వైద్య ఆరోగ్యశాఖతోపాటు, మహిళా, శిశు సంక్షేమ శాఖల అధికారులు, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.

Similar News

News December 3, 2025

మిర్యాలగూడలో అత్యధికం.. అడవిదేవులపల్లిలో అత్యల్పం..!

image

మిర్యాలగూడ నియోజకవర్గంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ల పర్వం ముగిసింది. ​మిర్యాలగూడ మండలంలో అత్యధికంగా 360 మంది సర్పంచ్ అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించగా, అతి తక్కువగా అడవిదేవులపల్లి మండలంలో కేవలం 101 మంది అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా వెల్లడించారు.

News December 3, 2025

నల్గొండ: తపాలా శాఖకు కలిసొచ్చిన పంచాయతీ ఎన్నికలు!

image

జిల్లాలో పంచాయతీ ఎన్నికలు తపాలా శాఖకు కలిసొచ్చాయి. నల్గొండ, చండూరు డివిజన్ల‌లో ఈనెల 11న, 14న మిర్యాలగూడ, 17న దేవరకొండ డివిజన్‌లో ఎన్నికలు జరగనుండగా.. ఇప్పటికే రెండు విడతల్లో నామినేషన్లు స్వీకరించారు. మూడో విడత నామినేషన్లు నేటి నుంచి స్వీకరిస్తున్నారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు కొత్త ఖాతాలు సమర్పించాల్సి ఉండడంతో పోస్ట్ ఆఫీసుల్లో ఖాతాలు తెరిచేందుకు బారులు తీరుతున్నారు.

News December 3, 2025

నల్గొండ: గ్రామ పంచాయతీలకు ఊరట..!

image

నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని బకాయిలు వసూళ్లు కావడంతో గ్రామ పంచాయతీలకు ఆదాయం పెరిగింది. పంచాయతీ ఎన్నికల్లో పోటీలో ఉండే అభ్యర్థులు ఇంటి పన్ను, నల్లా బకాయిలు చెల్లించి నామినేషన్ ఫారంకు రశీదు జతచేయాలని నిబంధన ఉండడం పంచాయతీలకు వరంగా మారింది. బకాయి బిల్లులు వసూలు కావడంతో పంచాయతీలకు కొంత ఊరట లభించింది. జిల్లా వ్యాప్తంగా 869 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.