News January 12, 2025
నల్గొండ: సంక్షేమ పథకాలపై సమన్వయ సమావేశం

నల్గొండ: ఉదయాధిత్య భవనంలో ఉమ్మడి జిల్లాల అధికారులతో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు& ఇందిరమ్మ ఇండ్ల పథకాల అమలుపై ముందస్తు సమన్వయ సమావేశం నిర్వహించారు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలను అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News September 18, 2025
NLG: ఇంటర్ ఫలితాలు తిరోగమనం…!

ఇంటర్మీడియట్ ఫలితాల్లో నల్గొండ జిల్లా తిరోగమనం వైపుగా పయనిస్తోంది. మూడేళ్లుగా జిల్లాలో ఫలితాలు తగ్గుముఖం పడుతున్నాయి. గతేడాది జిల్లా రాష్ట్రంలో 6వ స్థానంలో నిలువగా.. ఈ సారి మాత్రం ప్రథమ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రంలో 13వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 12వ స్థానానికి పడిపోయింది. మెరుగైన ఫలితాలు సాధించేందుకు యంత్రాంగం దృష్టి సారించాలని పేరెంట్స్ కోరుతున్నారు.
News September 18, 2025
ఎంజీయూలో వివిధ విభాగాలకు నూతన అధిపతుల నియామకం

మహాత్మా గాంధీ యూనివర్సిటీలోని వివిధ విభాగాలకు నూతన అధిపతులను నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. రసాయన శాస్త్ర విభాగానికి డా. ఎం.జ్యోతి, గణిత శాస్త్ర విభాగానికి డా. జి.ఉపేందర్‌రెడ్డి, భౌతిక శాస్త్ర విభాగానికి డా. శాంత కుమారి, రసాయన శాస్త్ర విభాగం బీఓఎస్ (బోర్డ్ ఆఫ్ స్టడీస్)గా డా. ఆర్.రూప నియమితులయ్యారు. వీరు రెండేళ్ల పాటు ఆయా విభాగాలకు అధిపతులుగా వ్యవహరిస్తారు.
News September 18, 2025
ఫలితాలను పెంచడంపై దృష్టి సారించాలి: కలెక్టర్

కెజిబివి, ఇంటర్మీడియట్ కళాశాలలో ఫలితాలను పెంచడంపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆయా పాఠశాలలు, ఇంటర్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను ఆదేశించారు. బుధవారం ఆమె కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కేజీబివిలు, ఇంటర్ కళాశాలల్లో ప్రవేశాలు, అప్లిఏషన్, ఫలితాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. గడిచిన 3 సంవత్సరాలలో ప్రవేశాలు తక్కువగా ఉన్నాయని అన్నారు.