News January 12, 2025

నల్గొండ: సంక్షేమ పథకాలపై సమన్వయ సమావేశం

image

నల్గొండ: ఉదయాధిత్య భవనంలో ఉమ్మడి జిల్లాల అధికారులతో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు& ఇందిరమ్మ ఇండ్ల పథకాల అమలుపై ముందస్తు సమన్వయ సమావేశం నిర్వహించారు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలను అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 18, 2025

నల్గొండ: వేసవికి నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని నల్గొండ పట్టణ ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నల్గొండ మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నీటి సరఫరా విభాగంపై ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. మంచి నీటి సరఫరాకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.

News February 18, 2025

నేడు పెద్దగట్టు జాతరలో చంద్రపట్నం

image

పెద్దగట్టు జాతరలో నేడు మూడోరోజు చంద్రపట్నం వేసి స్వామివారి కళ్యాణం నిర్వహించేందుకు దేవాలయ శాఖ అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. లింగమంతుల స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతున్నారు. తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రం నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

News February 18, 2025

నల్గొండలో రౌడీషీటర్ అరెస్ట్

image

NLGలోని రాక్ హిల్స్ కాలనీకి చెందిన రౌడీషీటర్ రాజేశ్‌ను అరెస్టు చేసినట్లు NLG డీఎస్పీ శివ రాంరెడ్డి సోమవారం తెలిపారు. ఇతనిపై సుమారు 17 హత్యకేసులు ఉన్నట్లు తెలిపారు. పట్టణంతో పాటు ఎల్బీనగర్ ఏరియాను అడ్డాగా చేసుకొని భూసెటిల్మెంట్లు, గంజాయి మత్తులో పలువురికి ఫోన్లు చేసి బెదిరిస్తుండటంతో బాధితుల ఫిర్యాదుతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.

error: Content is protected !!