News July 20, 2024

నల్గొండ: సమగ్ర సర్వేకు సిద్ధం!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏళ్లుగా రెవెన్యూ, అటవీశాఖల మధ్య భూ సరిహద్దుల్లో స్పష్టత లేకపోవడంతో దాదాపు 55 వేల ఎకరాల్లో రెండు శాఖల మధ్య ప్రస్తుతం హద్దుల వివాదం కొనసాగుతోంది. కృష్ణపట్టి ప్రాంతాలైన మఠంపల్లి, మేళ్లచెర్వు, పాలకవీడు, చింతపలపాలెం, దామెరచర్ల, పీఏపల్లి, చందంపేట, పెద్దవూరు హద్దుల తగాదా ఉంది. HYD సరిహద్దుల్లోనూ ఇదే సమస్య ఉంది. దీంతో సమగ్ర సర్వేకు అధికారులు సిద్ధమవుతున్నారు.

Similar News

News October 1, 2024

జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం

image

ఉమ్మడి జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం మొదలైంది. WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పదవి కాలం వచ్చే ఏడాది మార్చి 29తో ముగియనున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. అందులో భాగంగా ఓటర్ నమోదుకు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.

News October 1, 2024

డీఎస్సీ ఫలితాలలో సత్తాచాటిన నల్గొండ జిల్లా

image

నిన్న వెల్లడైన డీఎస్సీ ఫలితాలలో నల్గొండ జిల్లా వాసులు సత్తా చాటారు. పిల్లి సైదులు(గట్లమల్లేపల్లి)1వ ర్యాంక్ పీఈడీ, పల్లెభవాని (మునుగోడు) జీవశాస్త్రం1వ ర్యాంక్, హనుమంతు అనిల్ (త్రిపురారం) వ్యాయామం 2వ ర్యాంక్, ఎండీ కలీమెద్దీన్ (చిట్యాల) హిందీ 2వ ర్యాంక్, విజయేంద్రచారి (హాలియా) సోషల్ 4వ ర్యాంక్, వలిశెట్టి యాదగిరి (ఆకారం) సోషల్ 5వ ర్యాంక్ సాధించారు.

News October 1, 2024

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ముఖ్య సమాచారం

image

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588 అడుగుల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి ఇన్ ప్లో 49,651 క్యూసెక్కులు కొనసాగుతుంది. జల విద్యుత్ కేంద్రానికి 28,435, కుడి కాల్వకు 10,425, ఎడమ కాల్వకు 6,781, ఎస్ఎల్బీసీకి 2,400, వరద కాల్వకు 800 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.