News March 28, 2025

నల్గొండ: సమస్యలపై అడిషనల్ కలెక్టర్‌కు వినతి

image

ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి హాజరై మాట్లాడుతూ.. 6 గ్యారంటీలను ప్రభుత్వం వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేశారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌కు వినతి అందించారు. జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, సుధాకర్ రెడ్డి, నాగార్జున, దండెంపల్లి సత్తయ్య పాల్గొన్నారు.

Similar News

News November 13, 2025

విద్యార్థులను చూసి చలించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

image

మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం వద్ద ఆటోలో ప్రమాదకర స్థితిలో వెళ్తున్న మోడల్ స్కూల్ విద్యార్థులను చూసి చలించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆటోను ఆపి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల సమయానికి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేయాలని మిర్యాలగూడ ఆర్టీసీ డిపో అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎమ్మెల్యే స్పందన పట్ల స్థానిక ప్రజలు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

News November 13, 2025

ఐదుగురు వ్యక్తులు గ్రామస్థులతో కలిసి దాడి చేశారు: FRO

image

చందంపేట మండలం గువ్వలగుట్ట తండాలో నిన్న జరిగిన దాడిపై ఫారెస్ట్ రేంజ్ అధికారి భాస్కర్ గురువారం కీలక విషయాలు వెల్లడించారు. అటవీ భూమిలో సాగు చేస్తున్న గిరిజనులను హక్కు పత్రాలు చూపాలని కోరామన్నారు. కొన్నేళ్లుగా తాము సాగు చేసుకుంటున్నామని వాగ్వాదానికి దిగి ఐదుగురు వ్యక్తులు గ్రామస్థులతో కలిసి రాళ్ళు, కర్రలతో దాడి చేసి గాయపరిచారని చెప్పారు.

News November 13, 2025

NLG: నిర్దిష్ట లక్ష్యంతోనే పనులు: DRDO

image

జిల్లాలో చేపట్టిన జల్ సంచయ్, జల్ భాగీదారి కార్యక్రమం చేపట్టిన పనులకు కేంద్ర జలశక్తి శాఖ పురస్కారం ప్రకటించడం సంతోషంగా ఉందని DRDO పీడీ శేఖర్ రెడ్డి తెలిపారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచనలతో తాము ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో ఈ పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేశామన్నారు. నీటి వనరుల కొరత ఉన్న ప్రాంతాల్లో వర్షపు నీటిని సంరక్షించడంతో పాటుగా, భూగర్భజలాలు పెంచడమే కేంద్రంగా ఈ పనులు గుర్తించి నిర్వహించామన్నారు.