News March 29, 2024

నల్గొండ: సిట్టింగ్‌ స్థానాలను నిలబెట్టుకోవాలని..

image

నల్గొండ, భువనగిరి లోక్ సభ స్థానాలకు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ రెండు స్థానాలను గత ఎన్నికల్లో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న ఉత్తమ్ నల్గొండ నుంచి , కోమటిరెడ్డి భువనగిరి నుంచి ఎంపీలుగా గెలిచారు. ఈసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని చూస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ గెలుపుకోసం ఆరాటపడుతున్నాయి.

Similar News

News January 22, 2025

ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగపరచుకోవాలి

image

హుజూర్‌నగర్‌లోని టౌన్ హాల్‌లో బుధవారం పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మెగా ఉచిత గుండె, కిడ్నీ, ఎముకల వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎరగాని నాగన్న గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అయన సూచించారు.

News January 22, 2025

NLG: స్కాలర్ షిప్ దరఖాస్తులకు మరో ఛాన్స్

image

2024-25 విద్యా సంవత్సరానికి గాను ఉపకారవేతనాలు, ఫీజు రియంబర్స్‌మెంట్‌ల కొరకు ఈపాస్ అన్లైన్‌లో ఇంకనూ ధరఖాస్తు చేయని బీసీ, EBC విద్యార్ధులు మార్చి 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఖాజా నాజిమ్ అలీ అప్సర్ ఒక ప్రకటనలో కోరారు. ఈపాస్ వెబ్సైట్ ద్వారా తమ కళాశాల విద్యార్థుల వివరాలను ఆయా కళాశాలల ప్రిన్సిపల్‌లు నమోదు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

News January 22, 2025

మానవత్వం చాటుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే ‘వేముల’

image

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల మరోసారి మానవత్వం చాటుకున్నారు. నకిరేకల్ మండలం కడపర్తిలో బుధవారం జరిగిన ప్రజా పాలన గ్రామ సభకు హజరైన ఆయనకు ఓ మహిళ పెన్షన్ రావడంలేదని తెలిపింది. ఏడేళ్ల నుంచి నరాల వ్యాధితో బాధపడుతున్న తన భర్త సత్తయ్యకు పెన్షన్ రావడం లేదని గంగమ్మ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెల్లింది. పెన్షన్ మంజూరు అయ్యేంతవరకు తానే సొంత డబ్బులు ఇస్తానని హామీ ఇచ్చి డబ్బులు అందించారు.