News February 25, 2026

నల్గొండ: సెకన్లలో బస్తాలు ఖాళీ.. యూరియా కటకట!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో యూరియా కొరత రైతులను వేధిస్తోంది. కేంద్రం తెచ్చిన బుకింగ్ యాప్‌లో స్టాక్ వచ్చిన సెకన్లలోనే బస్తాలు ఖాళీ అవుతున్నాయని రైతులు వాపోతున్నారు. సాంకేతికత తెలియక బుకింగ్ చేసుకోలేక పోతున్నామని, ఎరువులు అందక పంట దిగుబడిపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News April 14, 2026

GNT: ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. తల్లిని చేసి మోసం చేశాడని ఫిర్యాదు!

image

ప్రేమించిన యువకుడు మోసం చేశాడని 12 రోజుల శిశువుతో ప్రత్తిపాడు (M) వంగిపురానికి చెందిన బాధిత యువతి (20) ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించింది. PGRSలో ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని వేడుకుంది. కాకినాడ (D) మామిదాలకు చెందిన సాయికృష్ణ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి తల్లిని చేసి మొహం చాటేశాడని వాపోయింది. గర్భానికి కారణం తాను కాదని చెప్తున్నాడని కన్నీటి పర్యంతమైంది.

News April 14, 2026

నేడు పెద్దపల్లిలో వీ-హబ్ ప్రారంభం

image

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉదయం 10 గంటలకు అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే 11 గంటలకు పెద్దపల్లిలో వీ-హబ్‌ను ప్రారంభిస్తారు. సాయంత్రం మంథనిలో రూ.32 లక్షలతో నిర్మించిన జేబీఎస్ పాఠశాలను మంత్రి ప్రారంభిస్తారు. శివ కిరణ్ గార్డెన్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారు. అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లు అందజేయనున్నారు.

News April 14, 2026

బీర్లను తెగ తాగేస్తున్నారు!

image

ఎండలు పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో బీర్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ఏపీలో 2025 మార్చిలో 20.11 లక్షల కేసుల బీరు అమ్ముడవగా ఈ ఏడాది మార్చిలో ఆ సంఖ్య 26.11 లక్షల కేసులకు పెరిగింది. అలాగే గతేడాది APR 1-12 వరకు 8.16 లక్షల కేసులు అమ్మితే ఈసారి అదే సమయంలో 9.2 లక్షల కేసులను విక్రయించారు. అటు <<19296712>>తెలంగాణలోనూ<<>> బీర్ల అమ్మకాలు 40 శాతం వరకు పెరిగినట్లు సమాచారం.