News July 20, 2024

నల్గొండ: “హలం పట్టి.. నారీమణులకు ఆదర్శంగా నిలిచి”.!

image

మునుగోడు మండలానికి చెందిన వీరమళ్ళ సునిత మగవారికి ధీటుగా హలం పట్టి పంట పొలాల్లో దూసుకెళ్తుంది. వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగిన ఈ నారీమణి చిన్ననాటి నుంచే పొలం పనుల్లో మెలకువలు నేర్చుకొని రాటు తేలింది. తనకున్న కాడెద్దులతో పత్తి, వరి పొలాల్లో గుంటుక, గొర్రు తోలుతూ ఒక ఎకరానికి ₹800/- చొప్పున రోజుకి 4 ఎకరాలకు ₹3200/- సంపాదిస్తుంది. నేడు స్వతహాగా ఉపాధి బాట పట్టి మరెందరికో ఆదర్శంగా నిలిచింది.

Similar News

News October 23, 2025

NLG: నేడే లాస్ట్.. ఇప్పటివరకు అందిన దరఖాస్తులు 4653!

image

నల్గొండ జిల్లాలో మద్యం దుకాణాలకు బుధవారం మరో 24 దరఖాస్తులు అందినట్లు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి సంతోశ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 154 మద్యం దుకాణాలు ఉండగా.. నేటి వరకు 4,653 దరఖాస్తులు అందాయని తెలిపారు. కొత్త మద్యం దుకాణాల లైసెన్స్ దరఖాస్తుల గడువు నేటితో ముగిస్తుందని తెలిపారు.

News October 22, 2025

నల్గొండ: మైనర్‌ బాలిక కేసులో నిందితుడికి 32 ఏళ్ల జైలు శిక్ష

image

మైనర్ బాలికను మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకొని, అత్యాచారం చేసిన కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు గురజాల చందుకు ఏకకాలంలో మొత్తం 32 ఏళ్ల జైలు శిక్ష, రూ.75 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు చెప్పింది. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం అందించాలని ఆదేశించింది. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.

News October 22, 2025

అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

నల్గొండ జిల్లాలోని వెటర్నరీ & అనిమల్ హస్బెస్టరీ, ఫిషరీష్ డిపార్ట్మెంట్ లలో డేటాఎంట్రీ ఆపరేటర్స్ (3), ఆఫీస్ సబార్డినేట్స్ (38) పోస్టులకు అవుట్సోర్సింగ్ సేవలను అందించటానికి ఎమ్ పానెల్ అయిన ఆసక్తి గల అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ తెలిపారు. ఈనెల 24వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.