News March 13, 2025
నల్గొండ: హోలీ ప్రశాంతంగా జరుపుకోవాలి: SP

హోళీ వేడుకలు ఇతరులకు హాని కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆకతాయిల కోసం షీ టీమ్ బృందాల నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని అన్నారు. హోలీ వేడుకలలో అల్లరి సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
Similar News
News March 16, 2025
నల్గొండలో చికెన్ ధరలు ఇలా

నల్గొండలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ (విత్ స్కిన్) కేజీ రూ.145 ఉండగా.. స్కిన్లెస్ కేజీ రూ. 165 ధర పలుకుతోంది. అలాగే లైవ్ కోడి రూ.100 ఉంది. కాగా, బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో గత నెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా, గత మూడు రోజులుగా అమ్మకాలు పెరగాయని, ధర సైతం పెరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు.
News March 16, 2025
NLG: పోరుబాటకు సిద్ధమైన అంగన్వాడీలు

తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై మరోసారి పోరాటానికి అంగన్వాడీలు సిద్ధమయ్యారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీచర్లు, ఆయాలు ఈనెల 17, 18వ తేదీల్లో నల్గొండ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ధర్నాకు సంబంధించి ఐసీడీఎస్ కార్యాలయాల్లో అధికారులకు సమ్మె నోటీసులు అందజేశారు. ఐసీడీఎస్ నిర్వీర్యం చేసే పీఎంశ్రీ పథకాన్ని రద్దు చేయాలని కోరారు.
News March 16, 2025
NLG: డ్రైవింగ్ కోర్సుకు దరఖాస్తు ఆహ్వానం

మోటార్ డ్రైవింగ్ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు BC సంక్షేమ అధికారి నజీం అలీ తెలిపారు. HYD హకీం పేటలో హెవీ మోటార్, లైట్ మోటర్ డ్రైవింగ్ నేర్పుతామన్నారు. 38 రోజులపాటు ఉచిత తర్వాత అర్హత ఉన్నవారికి ఉచితంగా పర్మినెంట్ లైసెన్స్ ఇస్తారని తెలిపారు. 8వ తరగతి ఉత్తీర్ణులైన వారు ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.