News March 13, 2025

నల్గొండ: హోలీ ప్రశాంతంగా జరుపుకోవాలి: SP

image

హోళీ వేడుకలు ఇతరులకు హాని కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.  ఆకతాయిల కోసం షీ టీమ్ బృందాల నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని అన్నారు. హోలీ వేడుకలలో అల్లరి సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

Similar News

News March 21, 2025

టెన్త్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

image

నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్‌లో ఉన్న ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్లతో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రానికి కేటాయించిన విద్యార్థులు, హాజరైన విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి పాల్గొన్నారు.

News March 21, 2025

నల్గొండ: మొదటి రోజు పరీక్షకు 40 మంది విద్యార్థుల గైర్హాజరు

image

నల్గొండ జిల్లా వ్యాప్తంగా 105 సెంటర్లలో నేడు ప్రారంభమైన పదవ తరగతి మొదటి రోజు పరీక్షకి 18511 విద్యార్థులకు గాను 18471 మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాధికారి బిక్షపతి తెలిపారు. మొత్తం 40 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. హాజరు శాతం 99.78 % నమోదు అయిందని, జిల్లా అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ 49 సెంటర్లను సందర్శించారని తెలిపారు.

News March 21, 2025

NLG: GOOD NEWS.. తీరనున్న తాగునీటి సమస్య

image

వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామాలలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకుగాను, తాగునీటి బోర్లు, చేతిపంపులు, పైపులైన్లు, తాగునీటి ట్యాంకుల మరమ్మతులకు గాను జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో 827 తాగునీటి పనులు చేపట్టేందుకు DMFT నిధుల నుంచి రూ.5 కోట్ల 10 లక్షలను విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎక్కడా తాగునీటికి సమస్య రాకుండా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు.

error: Content is protected !!