News March 13, 2025
నల్గొండ: 15 నుంచి ఒంటిపూట బడులు..!

నల్గొండ జిల్లాలో ఎండల తీవ్రత పెరగడంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు ఈనెల 15 నుంచి ఒక పూట బడులు నిర్వహిస్తామని జిల్లా డీఈవో భిక్షపతి అన్నారు. ఉదయం 8:30 గంటల నుంచి 12:30 గంటల వరకు తరగతుల నిర్వహణ ఉంటుందని, పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలలో ఒంటిగంట నుంచి ఐదు గంటల వరకు తరగతులు జరుగుతాయని తెలిపారు. ఏప్రిల్ 23వరకు ఒంటిపూట బడులు జరగనున్నాయి. SHARE IT.
Similar News
News March 19, 2025
NLG: జీపీ కార్మికుల వేతన వెతలు

నల్గొండ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు రాక ఆర్థిక కష్టాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీ కార్మికుల పట్టించుకునే నాథులే లేక దుర్భరమైన బతుకులు.. ఇది NLG జిల్లాలో 856 గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య కార్మికుల దుస్థితి. సకాలంలో వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు. 3నెలలుగా వేతనాలు పెండింగ్‌లో పెట్టడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు.
News March 19, 2025
NLG: ఈనెల 22న ప్రత్యేక ప్రజావాణి: కలెక్టర్

నల్లగొండ జిల్లాలో వివిధ సమస్యలతో బాధపడుతున్న వయోవృద్దులు, దివ్యాంగుల కోసం ఈనెల 22న నల్గొండ కలెక్టరేట్లో ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సాయంత్రం 3గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని వృద్ధులు, దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
News March 18, 2025
నల్గొండ: పనుల ప్రారంభం వేగవంతం చేయాలి: కలెక్టర్

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలతో నల్గొండ బైపాస్ జాతీయ రహదారి 565కు సంబంధించి అవార్డు పాస్ చేయడం, పనుల ప్రారంభం వంటివి వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం ఆమె తన ఛాంబర్‌లో నేషనల్ హైవే 565 నల్గొండ బైపాస్‌పై జాతీయ రహదారుల సంస్థ అధికారులు ,ఆర్ అండ్ బీ అధికారులతో సమావేశం అయ్యారు.