News February 14, 2025
నల్గొండ: 20నాటికి లబ్ధిదారుల జాబితా పూర్తికావాలి: కలెక్టర్ త్రిపాఠి

ఇందిరమ్మ ఇండ్ల సర్వే ఆధారంగా అన్ని గ్రామాలలో అర్హత ఉన్న లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎంపీడీఓలను ఆదేశించారు. శుక్రవారం ఆమె ఉదయాదీత్య భవన్‌లో ఎంపీడీవోలతో నమూనా ఇందిరమ్మ గృహాల నిర్మాణం, గ్రామాల వారీగా అర్హులైన లబ్ధిదారుల జాబితా తయారీ, తదిత అంశాలపై సమీక్షించారు. ఈనెల 20నాటికి అన్ని గ్రామాలకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని ఆదేశించారు.
Similar News
News March 20, 2025
నాగార్జునసాగర్‌కు భారీగా కేటాయింపులు

నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో వివిధ పనుల కోసం గతేడాది కంటే ఈసారి బడ్జెట్‌ను భారీగా పెంచింది. గతేడాది బడ్జెట్లో రూ.96.07 కోట్లు మాత్రమే కేటాయించిన ప్రభుత్వం ఈసారి వాటిని రూ.297.95 కోట్లకు పెంచింది. ఆ నిధులతో డ్యాం సంబంధిత, ప్రధాన పనులు, కాలువలు, డిస్ట్రిబ్యూటరీల పనులను చేపడతామని ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో సాగర్ ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News March 20, 2025
సూర్యాపేట జిల్లాలో యువతిపై అత్యాచారం

HNRలో యువతిపై అత్యాచారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. SI ముత్తయ్య తెలిపిన వివరాలిలా.. పట్టణానికి చెందిన స్వామిరోజాకు ఓ యువతితో పరిచయముంది. రోజా ద్వారా ఆమె ప్రియుడు ప్రమోద్‌కుమార్ యువతికి పరిచయమయ్యాడు. ఈనెల 7న ఆ యువతిని ప్రమోద్ కుమార్ ఓ లాడ్జికి తీసుకెళ్లి మద్యం తాపి అత్యాచారం చేసి ఫోటోలు తీశారు. తిరిగి మంగళవారం ఆ యువతిని లోబర్చుకునేందుకు ప్రయత్నించగా తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
News March 20, 2025
NLG: ఎంబ్రాయిడరీ వర్క్‌లో మహిళలకు ఉచిత శిక్షణ

నల్గొండ శివారులోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ మహిళలకు మార్చి 24 నుంచి మగ్గం వర్క్ (ఎంబ్రాయిడెరీ)లో 30 రోజుల ఉచిత శిక్షణ అందజేస్తున్నామని సంస్థ డైరెక్టర్ రఘుపతి తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత టూల్ కిట్, వసతి, భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. 18 సం. నుంచి 45 సంవత్సరాలలోపు ఉమ్మడి నల్గొండకు చెందిన వారు అర్హులని, ఆసక్తి గల వారు మార్చి 23 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.