News March 17, 2025

నల్గొండ: 35 మంది అర్జీదారులతో మాట్లాడిన ఎస్పీ 

image

పోలీసు గ్రీవెన్స్ డేలో పలు ఫిర్యాదులను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఈరోజు పరిశీలించారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 35 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు.

Similar News

News March 18, 2025

నల్గొండ: సీతారాముల కళ్యాణ తలంబ్రాలు ఇంటికే: RM

image

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాలను TGS RTC కార్గో ద్వారా రూ.151 చెల్లిస్తే భక్తుల ఇళ్ల వద్దకు చేరుస్తామని ఉమ్మడి నల్గొండ రీజినల్ మేనేజర్ కే. జాని రెడ్డి తెలిపారు. ప్రజలు తమ దగ్గరలో ఉన్న ఆర్టీసి లాజిస్టిక్స్‌లో రూ.151 చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 18, 2025

NLG: సొరంగంలో కాలువల్లా పారుతున్న నీరు

image

ఎస్ఎల్బీసీ సొరంగంలో ఊట నీరు ఏమాత్రం తగ్గడం లేదు. సొరంగంలోని 13.5 కిలోమీటర్ల తర్వాత ఏర్పాటుచేసిన డీ2 ప్రాంతంలో కాలువల పారుతుండడంతో సహాయక చర్యలకు ప్రధాన అడ్డంకిగా మారుతున్నట్లు తెలుస్తోంది. నీటిని డివాటరింగ్ చేసేందుకు అధికారులు ప్రతి 2.5 కిలోమీటర్ల దూరంలో పంపింగ్ మోటార్లు ఏర్పాటు చేసి నీటిని బయటికి పంపి చర్యలు తీసుకుంటున్నప్పటికీ వరద ప్రవాహం ఎక్కడా తగ్గడం లేదని అధికారులు పేర్కొంటున్నారు.

News March 18, 2025

NLG: కారు టైర్ పగిలి రోడ్డు ప్రమాదం.. తాత, మనవడు మృతి

image

జడ్చర్ల జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరగ్గా ఇద్దరు మృతి చెందారు. చండూరుకు చెందిన శేఖర్ రెడ్డి, శ్వేత దంపతులకు ఇద్దరు కుమారులు. వీరు HYDలో ఉంటున్నారు. చిన్న కుమారుడు నిదయ్ రెడ్డి, తండ్రి వెంకట్ రెడ్డిలతో కలిసి శ్వేత HYD నుంచి జడ్చర్లకు వెళ్తున్నారు. మాచారం సమీపంలో టైరుపగిలి అవతలివైపు వస్తున్న బస్సును ఢీకొట్టగా తాత, మనవడు మృతిచెందారు. శ్వేత పరిస్థితి విషమంగా ఉంది.

error: Content is protected !!