News February 27, 2025

నల్గొండ: 55.48 శాతం పోలింగ్ నమోదు

image

వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటింగ్‌లో భాగంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 12 గంటల వరకు 2,598 మంది ఉపాధ్యాయులు ఓట్లు వేయగా 55.48% పోలింగ్ నమోదైంది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయగా ఎన్నికల అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Similar News

News March 17, 2025

నల్గొండ: ట్రాక్టర్ టైర్ కింద పడి డ్రైవర్ దుర్మరణం

image

బోయినపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కడారి వెంకన్న యాదవ్ (48 ) సోమవారం ప్రమాదవశాత్తు ట్రాక్టరు మధ్య టైర్ కింద పడి తీవ్ర గాయాలతో దుర్మరణం చెందాడు. ట్రాక్టర్లో ఇసుక లోడ్ చేసుకుని నల్గొండకు తరలిస్తున్నాడు.  ఈ క్రమంలో ట్రాక్టర్ ట్రాలీ డోరు లూజు కాగా దానిని సరిచేసి ట్రాక్టరు డ్రైవింగ్ సీట్లోకి ఎక్కుతున్న క్రమంలో కాలుజారి టైరు కింద పడడంతో తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు.

News March 17, 2025

భువనగిరి కోటపైన రోప్ వే

image

భువనగిరి కోటపైన రోప్ వే త్వరలోనే అందుబాటులోకి రానుంది. కి.మీ మేర దీనిని నిర్మించేందుకు పర్యాటక సంస్థ రూ.56.81 కోట్లతో టెండర్లను పిలిచింది. HYD-WGL హైవే నుంచి కోట వరకు ఈ రోప్ వే ఉండనుండగా రాష్ట్రంలో ఇది మొదటిది కానుంది. మరో నాలుగు రోప్ వేలకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా అందులో యాదాద్రి టెంపుల్, నల్గొండ హనుమాన్ కొండ, నాగార్జున సాగర్ ఆనకట్ట ఉన్నాయి.

News March 17, 2025

మిర్యాలగూడ: రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం దామరచర్లలో జరిగింది. NLG రైల్వే ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల శివారులో విష్ణుపురం-కొండ్ర పోల్ రైల్వే స్టేషన్ల మధ్య యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్‌కు వెళ్లే రైల్వే గేట్ వద్ద ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి ( సుమారు 45 ఏళ్లు ) రైలు కింద పడి మృతి చెందారు. మృతదేహాన్ని MLG ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

error: Content is protected !!