News May 11, 2024
నల్గొండ: ’63 మంది నామినేషన్ చెల్లుబాటు’

NLG-WGL-KMM జిల్లాల పట్టభద్రుల MLC బై పోల్‌కు 69 మంది అభ్యర్థులు 117 సెట్ల నామినేషన్లు సమర్పించారని రిటర్నింగ్ అధికారి హరిచందన తెలిపారు. 6 నామినేషన్లు తిరస్కరించినట్లు వెల్లడించారు. 63మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటయ్యాయన్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుందన్నారు. ఈ నెల 27న పోలింగ్, జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు.
Similar News
News January 4, 2026
నల్గొండ జిల్లాలో టుడే టాప్ న్యూస్

నేరేడుగొమ్ము: ప్రేమ విఫలం .. పీఎస్‌లో యువతి సూసైడ్ అటెంప్ట్
నల్గొండ: నకిలీ బంగారం ముఠా గుట్టురట్టు
దామరచర్ల: పల్టీ కొట్టిన కారు
నల్గొండ: నీటి వాటాలో తెలంగాణ ద్రోహం : ఉత్తమ్
నల్గొండ: పట్టణాల్లో వేడెక్కిన పుర రాజకీయాలు
మిర్యాలగూడ: ఐదేళ్లలో 13 వేలకు పైగా పెరిగిన ఓటర్లు
నల్గొండ: పల్లె వెలుగు.. ఇక కనుమరుగు
నల్గొండ: రేపటి నుంచి టెట్ పరీక్షలు
నల్గొండ: మళ్లీ పడగా విప్పుతున్న కుష్టు
News January 3, 2026
NLG: జానారెడ్డిని పరామర్శించిన మండలి చైర్మన్ గుత్తా

మాజీ మంత్రి జానారెడ్డిని శనివారం పలువురు ప్రముఖులు పరామర్శించారు. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న జానారెడ్డి ప్రస్తుతం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
News January 3, 2026
నల్గొండ: ఓటరు జాబితా సవరణలో వేగం పెంచాలి: కలెక్టర్

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా నిర్దేశించిన రోజువారీ లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి అధికారులు ప్రతిరోజూ కనీసం 40 ఎంట్రీలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.


