News May 11, 2024
నల్గొండ: ’63 మంది నామినేషన్ చెల్లుబాటు’

NLG-WGL-KMM జిల్లాల పట్టభద్రుల MLC బై పోల్‌కు 69 మంది అభ్యర్థులు 117 సెట్ల నామినేషన్లు సమర్పించారని రిటర్నింగ్ అధికారి హరిచందన తెలిపారు. 6 నామినేషన్లు తిరస్కరించినట్లు వెల్లడించారు. 63మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటయ్యాయన్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుందన్నారు. ఈ నెల 27న పోలింగ్, జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు.
Similar News
News February 15, 2025
మర్రిగూడ: కొనసాగుతున్న ఏసీబీ సోదాలు..

మర్రిగూడ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం <<15462226>>సర్వేయర్ రవి<<>> లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పటికీ కార్యాలయంలో అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ధరణిలో జరిగిన అక్రమ భూరిజిస్ట్రేషన్‌లపై ఆఫీసర్లు సిబ్బంది నుంచి కూపీ లాగుతున్నారు. ఆఫీస్‌లోని రికార్డులను పరిశీలిస్తున్నారు.
News February 14, 2025
నల్గొండ: 20నాటికి లబ్ధిదారుల జాబితా పూర్తికావాలి: కలెక్టర్ త్రిపాఠి

ఇందిరమ్మ ఇండ్ల సర్వే ఆధారంగా అన్ని గ్రామాలలో అర్హత ఉన్న లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎంపీడీఓలను ఆదేశించారు. శుక్రవారం ఆమె ఉదయాదీత్య భవన్‌లో ఎంపీడీవోలతో నమూనా ఇందిరమ్మ గృహాల నిర్మాణం, గ్రామాల వారీగా అర్హులైన లబ్ధిదారుల జాబితా తయారీ, తదిత అంశాలపై సమీక్షించారు. ఈనెల 20నాటికి అన్ని గ్రామాలకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని ఆదేశించారు.
News February 14, 2025
పెద్దగట్టు జాతరకు 60 స్పెషల్ బస్సులు..

తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర అయిన సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లి గ్రామంలో జరిగే లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతరకు సూర్యాపేట డిపో నుంచి 60 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా RM కే.జానిరెడ్డి తెలిపారు. పెద్దగట్టు జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని తెలిపారు. ఈ సదుపాయాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.