News January 11, 2025
నల్గొండ: BRS రైతు మహాధర్నా మళ్లీ వాయిదా!
BRS రైతు మహాధర్నా మరోసారి వాయిదా పడింది. నల్గొండ టౌన్‌లో ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. సంక్రాంతి పండుగ ప్రయాణాలు, విజయవాడ-హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ రద్దీతో పాటు తదితర కారణాలతో పండుగ తర్వాత మహాధర్నా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఫార్ములా ఈ రేసు కేసులో KTR విచారణ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని BRS ముందుకు జరుపుతూ వస్తోంది. తాజాగా ఆయన విచారణ ముగిసిన సంగతి తెలిసిందే.
Similar News
News January 18, 2025
ఈ నెల 21న నల్గొండకు కేటీఆర్
నల్గొండకు ఈ నెల 21 బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన రైతు మహాసభలో పాల్గొననున్నారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో పార్టీ నాయకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ ఓటమి తరువాత నల్గొండ టౌన్‌కు కేటీఆర్ రావడం ఇదే మొదటిసారి. కాగా ఈ నెల 13న నిర్వహించాల్సిన రైతు మహాసభ వివిధ కారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే.
News January 18, 2025
BREAKING: సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం
సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. SV కళాశాల సమీపంలో రెండు ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో క్లినర్ బస్సు అద్దంలో నుంచి ఎగిరిపడగా.. అతడి పైనుంచి బస్సు వెళ్లడంతో స్పాట్‌లోనే చనిపోయాడు. గుండెపోటుతో ప్రయాణికుడు మృతిచెందాడు. మృతిచెందిన వారు గుంటూరువాసులు సాయి, రసూల్‌గా పోలీసులు గుర్తించారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. రెండు బస్సులు గుంటూరు నుంచి HYD వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
News January 18, 2025
నర్సన్న నిత్య ఆదాయం రూ.35,63,82
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం 1260 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా కళ్యాణ కట్ట ద్వారా రూ.63,000, ప్రసాద విక్రయాలు రూ.11,51,690, VIP దర్శనాలు రూ.3,75,000, బ్రేక్ దర్శనాలు రూ.1,80,300, కార్ పార్కింగ్ రూ.4,50,000, వ్రతాలు రూ.80,800, సువర్ణ పుష్పార్చన రూ.79,432, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.35,63,824 ఆదాయం వచ్చినట్లు ఆలయ EO భాస్కరరావు తెలిపారు.