News June 2, 2024

నల్గొండ: CPAC సర్వే.. BRS గెలుపు!

image

వరంగల్-నల్గొండ-ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో BRS గెలుస్తుందని సీపాక్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో వెల్లడైంది. అలాగే ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో BRS 11, BJP 2, కాంగ్రెస్, ఎంఐఎం చెరొకటి గెలుస్తాయని అంచనా వేసింది. భువనగిరిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుందని పేర్కొంది. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 64/66, బీఆర్ఎస్‌కు 39/40 సీట్లు వస్తాయని చెప్పిన మాట నిజమైందని సీపాక్ తెలిపింది.

Similar News

News November 18, 2025

NLG: యాసంగికి ఢోకా లేదు..!

image

శాలిగౌరారం ప్రాజెక్టులో ప్రస్తుతం యాసంగి సీజన్‌కు నీటి నిలువలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. సాధారణంగా వానాకాలం పంటకు సాగునీటి సమస్యలు లేకున్నా యాసంగి పంటకు సరిపడా సాగునీరు అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడేవారు. కానీ గత నెలలో కురిసిన భారీ వర్షాలు తుఫాన్‌ల వల్ల ఎగువ నుంచి భారీగా ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరింది. ఈ ప్రాజెక్టు కింద 5వేల ఎకరాల ఆయకట్టు ఉంది.

నేడు జలశక్తి మిషన్ అవార్డు ప్రదానం

image

జల్ సంచయ్ జన్ భాగీదారీ పథకం కింద నల్గొండ జిల్లా అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ అవార్డును కేంద్ర జలశక్తి మిషన్ ఈనెల 18న ఢిల్లీలో ఇవ్వనుంది. జిల్లాకు రూ.2 కోట్ల ప్రోత్సాహకం అందజేయనుంది. జిల్లాలో భూగర్భ జలాల పెంపునకు 84,827 పనులను చేపట్టినందుకు గాను ఈ అవార్డును భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేయనున్నారు. అవార్డును అందుకునేందుకు జిల్లా డీఆర్డీఏ అధికారులు ఢిల్లీకి వెళ్లారు.