News March 16, 2025

నల్గొండ: DCCలకు పదవులు.. అధ్యక్ష పీఠంపై ఇంట్రస్ట్

image

డీసీసీ పదవికి భారీగా డిమాండ్ పెరిగింది. నల్గొండ DCCగా ఉన్న శంకర్ నాయక్‌కు ఎమ్మెల్సీగా అవకాశం దక్కడంతో ఆ పదవికి పలువురు పోటీ పడుతున్నారు. సూర్యాపేట డీసీసీగా ఉన్న వెంకన్నను రైతు కమిషన్ సభ్యుడిగా నియమించింది. దీంతో ఇక్కడ కూడా డీసీసీ అధ్యక్ష పదవిపై పలువురి దృష్టి పడింది. సూర్యాపేట స్థానాన్ని జనరల్, యాదాద్రి జిల్లాకు ఎస్సీ లేదా జనరల్ కోటాలో భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు చర్చ నడుస్తోంది.

Similar News

News April 19, 2025

అనకాపల్లి: రాగల ఐదు రోజుల్లో వర్షాలు

image

రాగల ఐదు రోజులు జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉండి, తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ఆర్ఎఆర్ఎస్ వాతావరణ విభాగం శాస్త్రవేత్త వి.గౌరి శుక్రవారం తెలిపారు. ఈ ఐదు రోజులు గరిష్టంగా 35.4 నుంచి 37.0 డిగ్రీలు, కనిష్టంగా 26.6 నుంచి 27.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదౌతాయని పేర్కొన్నారు. గాలిలో తేమ శాతం ఉదయం 80 నుంచి 85 వరకు, మధ్యాహ్నం 72 నుంచి 78 వరకు ఉండి, గాలి గంటకు 4 నుంచి 5 కిలోమీటర్లు వీస్తుందని వివరించారు.

News April 19, 2025

నేడు ఐపీఎల్‌లో డబుల్ ధమాకా

image

IPLలో ఇవాళ 2 మ్యాచ్‌లు జరగనున్నాయి. మ.3.30కు అహ్మదాబాద్ వేదికగా టైటాన్స్‌తో ఢిల్లీ తలపడనుంది. ఇప్పటి వరకూ ఈ రెండింటి మధ్య 5 మ్యాచులు జరగ్గా DC 3, GT 2 సార్లు గెలిచాయి. అలాగే, రాత్రి 7.30కు జైపూర్‌లో రాజస్థాన్, లక్నో బరిలోకి దిగనున్నాయి. ఈ టీమ్స్ గతంలో ఐదుసార్లు తలపడితే రాజస్థాన్‌(4)దే పైచేయిగా నిలిచింది. పక్కటెముకల గాయంతో బాధపడుతున్న RR కెప్టెన్ శాంసన్ ఈ మ్యాచ్ ఆడటంపై సందిగ్ధం నెలకొంది.

News April 19, 2025

ఘోర ప్రమాదం.. కడప ప్రయాణికులు సేఫ్

image

కడప ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. నిన్న రాత్రి దాదాపు 20మందితో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు కడప నుంచి బయల్దేరింది. గద్వాల(D) ఇటిక్యాల(M) మండలంలోని ప్రియదర్శి హోటల్ వద్ద హైదరాబాద్ నుంచి నంద్యాల వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ దాటి కడప బస్సు పైకి దూసుకొచ్చింది. కారులోని ఇద్దరు చనిపోగా.. బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. బస్సు డ్యామేజ్ కావడంతో కడప ప్రయాణికులను మరో వాహనంలో HYD తరలించారు.

error: Content is protected !!