News June 20, 2024

నల్గొండ: ITI స్థానంలో ATC.. విదేశాల్లో జాబ్స్

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఏడు ఐటీఐల స్థానంలో ఏటీసీ(అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్) లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతీ ఏటీసీలో ఆరు కోర్సులు ఉండనున్నాయి. ఏటీసీగా మార్చేందుకు ఒక్కోదానికి రూ.34 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు 4వేల మందికి లబ్ధి చేకూరనుండగా ఈ కోర్సుల ద్వారా విదేశాల్లోనూ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.

Similar News

News October 16, 2025

ఇందిరమ్మ ఇళ్ల అమలులో నల్గొండకు రెండో స్థానం

image

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, గ్రౌండింగ్, చెల్లింపులు, ఇండ్ల పురోగతిలో నల్గొండ జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. జిల్లా యంత్రాంగం కృషిని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ పి.గౌతమ్ అభినందించారు. బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

News October 16, 2025

పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన నల్గొండ కలెక్టర్‌

image

శాలిగౌరారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) కలెక్టర్‌ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వైద్య అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు.

News October 16, 2025

NLG: గాడి తప్పుతున్న విద్యాశాఖ..!

image

NLGలో విద్యాశాఖ గాడి తప్పుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, పట్టింపు లేమి వెరసి ఆ శాఖపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆరేళ్లుగా రెగ్యూలర్ DEO లేకపోవడంతో ఇక్కడ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ప్రస్తుతం FAC DEO బిక్షపతి అసలు పోస్టు వరంగల్ (D) లష్కర్ బజార్ ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్ గ్రేడ్-1 గెజిటెడ్ హెడ్ మాస్టర్. 2019 OCTలో డిప్యూటేషన్‌పై ఇక్కడికి వచ్చారు.